BigTV English

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్..

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ కి బ్రేక్..
Jr NTR new movie update

Jr NTR new movie update(Tollywood news in telugu):


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ దేవర కోసం అందరూ ఎదురు చూస్తున్నారు .వచ్చే సమ్మర్ కూల్ ట్రీట్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతోంది .ఇప్పటికే ఈ చిత్రం నుంచి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు గోలగోల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తో ఒకప్పటి టాలీవుడ్ అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది.

ఇప్పటివరకు కొరటాల శివ తెరకెక్కించిన అన్ని సినిమాలకు భిన్నంగా దేవర చిత్రాన్ని సరికొత్త పద్ధతిలో ముందుకు తీసుకువెళ్తున్నారని టాక్. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలా ఉంటుంది అన్న విషయం ఇప్పటికే ప్రేక్షకులకు ఒక ఐడియా ఇచ్చేశాడు డైరెక్టర్. ఒక చిన్న మారుమూల దీవి నేపథ్యంలో సాగే ఫిక్షనల్ స్టోరీ గా ఈ స్టోరీ ముందుకు నడుస్తోంది. కేజిఎఫ్ కోసం ప్రశాంత్ నీల్ ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ ప్రపంచాన్ని సృష్టించాడు.. అదే తరహాలో ఇప్పుడు దేవర కోసం కొరటాల శివ మరొక సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని టాక్.


ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయింది. ఒక షెడ్యూల్ నుంచి మరొక షెడ్యూల్ కి వారం రోజులకు మించకుండా గ్యాప్ తీసుకుంటూ ఎంతో జాగ్రత్తగా నిర్విరామంగా సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. అయితే సడన్ గా ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది.. ఇప్పటివరకు ఫాస్ట్ ఫాస్ట్ గా సాగిన ఈ షూటింగ్ కు ఇలా సడన్ బ్రేక్ పడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ విషయం ఏమిటంటే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం కోసం ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తున్నారంట. ఈ నేపథ్యంలో దేవర షూటింగ్ కి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ కి కాస్త విరామం దొరికింది. అయితే ఇది కూడా మంచిదే అంటున్నారు చిత్ర బృందం. ఇప్పటివరకు రెగ్యులర్ షెడ్యూల్స్ కారణంగా అసలు తీరిక లేకపోవడంతో టీం మొత్తం బాగా అలసిపోయి ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఇటువంటి చిన్న బ్రేక్ తిరిగి ఉత్సాహంగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది అని వారు భావిస్తున్నారు.

ఇక జనవరి కంతా దేవరకు సంబంధించిన మొత్తం షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే తారక్ బాలీవుడ్ వార్ 2 షూటింగ్  మూవీ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ మూవీలో తారక్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో మొదటిసారి నెగటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో తారక్ కనిపించబోతున్నారు. ఈ మూవీ కూడా వేరే లెవెల్ అనిపించే విధంగా తెరకెక్కిస్తున్నారు. ఇది హిట్ అయితే ఇంకా ఎన్టీఆర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోతాడేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×