E-Paper
Advertisement

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్ల మీదకు ఢిల్లీ ప్రజలు, ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం

ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రోడ్ల మీదకు ఢిల్లీ ప్రజలు, ఉత్తరాఖండ్‌లో భూకంప కేంద్రం
Advertisement

Delhi: ఈ మధ్యకాలం హిమాలయాలను భూకంపం వణికిస్తోంది. దాని ప్రభావం మెల్లగా ఉత్తరాదిపై పడింది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.9గా నమోదు అయ్యింది. భూమి వణకడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు.

ఉత్తరాదిని వణికించిన భూకంపం

ఉత్తర భారతాన్ని భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రత నమోదైంది. ఒక్కసారి భూమి వణకడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. ఉత్తరాఖండ్‌లో భూకంపం సంభవించిన కొద్దిసేపటికి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్,హర్యానా సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం రాలేదు.

తొలుత ఉత్తరాఖండ్, ఆ తర్వాత ఢిల్లీ

Advertisement

జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం వివరాల మేరకు ప్రకారం.. మంగళవారం రాత్రి 10.15 గంటలకు భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి-ఖడూన్ కేంద్రంగా 13 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్‌లో భూకంపం వచ్చిన కాసేపటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

రోడ్ల మీదకు పరుగులు తీసిన ప్రజలు

ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పెద్ద పెద్ద భవనాల నుంచి ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి రాలేదని చెబుతున్నారు. మరోవైపు అస్సాంలోని నాగావన్ ప్రాంతంలోనూ 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Advertisement

ALSO READ: ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, నోయిడా, మీరట్ వంటి ప్రాంతాల్లోని ఎత్తైన హౌసింగ్ సొసైటీల్లో ఫ్యాన్లు, లైట్లు ఊగడంతో అందులోని ప్రజలు రోడ్ల పైకి పరుగులు తీశారు. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా భూకంపం సంభించినట్టు వార్తలు వస్తున్నాయి. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో సంభవించిన నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

Big Stories

Advertisement
×