E-Paper
Advertisement

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

ఢిల్లీలో హైటెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!
Advertisement

Rahul Gandhi: ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆకాశవాణి భవన్‌లో రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. వీరితో పాటుగా ప్రియాంక గాంధీ, కేసి వేణుగోపాల్, దీపేంద్ర హుడ, పలువురు కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేసారు. SIR ప్రక్రియ, ఓట్ చోరి, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 8 గంటల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.

బారికేడ్ పైకి ఎక్కి..

సర్ మరియు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీవ్ర అవకతలు జరిగాయంటూ దీనిపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేఖంగా రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. దీంతో ఆకాశవాణి భవన్ ముందు పోలీసులు అడ్డకోవడంతో కొద్ది సేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పోలీసు బారికేడ్ పైకి ఎక్కి జాతీయ జెండాను చేతపట్టి నిరసన తెలపడం సంచలనంగా మారింది.

జైరామ్ రమేష్ ఫైర్..

Advertisement

భారతీయుల ఓటు హక్కును హరించే పద్ధతి ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్య హత్యగా పరిణమించిందని కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ ఫైర్ అయ్యారు. భారత ఎన్నికల సంఘంతో సమావేశం కావాలన్న ఒకే ఒక్క ప్రధాన డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఈడ్చుకెళ్లారు. భారతదేశంలో ప్రజాస్వామ్య హత్యకు సహ కుట్రదారుడి నియంత్రణలో ఉన్న ఢిల్లీ పోలీసులు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడిని మరియు ఇతరులను నిర్బంధించారు. తమ పతనం ఆసన్నమైందని తెలిసిన ఒక ప్రభుత్వానికి ఇది సంకేతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also read: ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

Tags

Related News

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

Big Stories

Advertisement
×