E-Paper
Advertisement

Ninnu kori Serial Today Episode October 7th ‘నిన్ను కోరి’ సీరియల్‌: మరోసారి సామ్రాట్ ను చంపేస్తానన్న దాక్షాయణి   

Ninnu kori Serial Today Episode October 7th ‘నిన్ను కోరి’ సీరియల్‌: మరోసారి సామ్రాట్ ను చంపేస్తానన్న దాక్షాయణి   
Advertisement

Ninnu kori serial today Episode: దాక్షాయణి, జీవన్‌ రూంలోకి వెళ్తుంది. దాక్షాయణిని చూసిన జీవన్‌ హ్యాపీగా అమ్మా నువ్వు ఈరోజు నన్ను నమ్మావు. నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా..? అంటూ చెప్పబోతుంటే.. దాక్షాయణి కోపంగా జీవన్‌ను లాగిపెట్టి కొట్టి నిన్ను నమ్మానా..? నీ మీద ఉన్న పిచ్చి ప్రేమే నిన్ను కాపాడుకునేలా చేసింది. నీ అన్నయ్య మీద ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. నీ మీద ఉన్నది పిచ్చి ప్రేమ అంటూ చెప్పగానే.. జీవన్‌ షాకింగ్‌గా ఏంటి అన్నయ్య మీద ఉన్నది ప్రేమ కాదా..? అని అడుగుతాడు. అవునని దాక్షాయణి చెప్తుంది. అంతా డోర్‌ దగ్గర చాటుగా నిల్చుని చంద్ర వింటుంది. దాక్షాయణి మాటలకు చంద్ర షాక్‌ అవుతుంది.

ఈ ఆస్తి మొత్తం వాడి తల్లిది అది పోయినప్పుడు ఈ ఆస్థిలో సామ్రాట్‌కు తప్ప ఎవ్వరికీ చిల్లి గవ్వ కూడా దక్కదని వీలునామా రాసి చనిపోయింది. నేను మాత్రం ఈ ఆస్థి మొత్తం మీ నాన్నది అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ నీకు ఈ ఆస్థిలో చిల్లిగవ్వ దక్కదని తెలిసి షాక్‌ అయ్యాను. తర్వాత సామ్రాట్‌ మీద లేని ప్రేమను నటించాను. వాడు నా మాట తప్ప వేరే ఎవరి మాట వినకుండా పెంచాను ఎందుకంటే నీకోసం కానీ నువ్వు చిన్నప్పటి నుంచి నా మాట వినలేదు. ఎంత చెప్పినా చెడ్డ దారిలోనే నడిచావు.. ఒకరోజు వాడికి నా ప్రేమ నిజం అని తెలిసింది. నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడేమో అనుకున్నాను.. కానీ వాడు చాలా సులువుగా నన్ను క్షమించాడు. అప్పుడు నా కడుపున పుట్టిన కొడుకు ఎందుకు అలా లేడని బాధేసింది.

Advertisement

నువ్వు మాత్రం ఆ రామయ్య కూతురును పెళ్లి చేసుకుంటానని దానికి కడుపు చేశావు.. దాని చావుకు కారణం అయ్యావు ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే.. మీ అన్నయ్యే చెప్పాడు. విషయం తెలిసి వాడు నీకు బడితే పూజ చేసి వచ్చి నాకు చెప్పాడు.. నిన్ను క్షమించమని అడిగాను కానీ నా మాట వినలేదు. సామ్రాట్‌ నిన్ను జైలుకు పంపిస్తానని మొండికేశాడు. అందుకే దామోదర్‌ను పిలిచి మీ అన్నయ్యను చంపేయమని చెప్పాను. వాణ్ని చంపాము అని చెప్పారు. ఒకరోజంతా బాధపడ్డాను. కానీ నిన్ను కాపాడుకున్నానన్న తృప్తి మిగిలింది. జీవన్‌ నీ కోసం నేను ఏమైనా చేస్తాను. నాకోసం నువ్వు కాస్త మారరా అంటూ చెప్పగానే.. జీవన్‌ ఏడుస్తూ.. దాక్షాయణి కాళ్ల మీద పడుతాడు. దాక్షాయణి ఓదారుస్తూ.. ఆ రామయ్య సంగతి దామోదర్‌ చూసుకుంటాడు అని చెబితే.. అన్నయ్యకు గతం గుర్తుకు వస్తే అమ్మా అంటూ జీవన్‌ అడిగితే.. గుర్తు రాకూడదనే అనుకుందాం.. వస్తే నాలోని కన్నతల్లి మళ్లీ బయటకు వస్తుంది అంటూ చెప్తుంది. అంతా విన్న చంద్ర భయంతో బయటకు పరుగెడుతుంది.

దాక్షాయణిలో ఇంత పగ ఉందని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బావకు బయటి నుంచే శత్రువులు ఉన్నారు అనుకున్నాను కానీ ఇంట్లోనే ప్రాణానికి ప్రమాదం ఉంది..? ఇప్పుడెలా మదన్‌ గారు ఎటు వెల్లారో అనుకుంటూ భయపడుతుంది చంద్ర. అప్పుడే ఇంటోంచి వస్తున్న విరాట్‌ను పక్కకు తీసుకెళ్లి మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్దాం పదండి అంటూ చెప్పగానే.. సామ్రాట్‌ అలియాస్‌ విరాట్‌ షాక్‌ అవుతాడు. ఎందుకు ఏమైంది..? నువ్వు నా పక్కన ఉండగా నాకేం కాదు. మా అమ్మ నాకు కంచెలా ఉంది అంటూ చెప్తాడు.

Advertisement

చంద్ర మాత్రం ఎలాగైనా బావను ఇక్కడి నుంచి తీసుకెళ్లాలి అని మనసులో అనుకుంటుంది. ఎలాగైనా సామ్రాట్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తుంది. కానీ సామ్రాట్‌ వినడు. తనకేం కాదని కంగారు పడొద్దని చెప్పి వెళ్లిపోతాడు సామ్రాట్‌. సామ్రాట్ కు ఎలాగైనా నిజం చెప్పాలని అందుకోసం తన దగ్గర ఏ సాక్ష్యం లేదని ఆలోచిస్తూ.. వెళ్లి సామ్రాట్‌ రూంలో వెతుకుతుంది చంద్ర. చంద్రకు డైరీ లభిస్తుంది. అది చూస్తే.. సామ్రాట్‌కు డైరీ చూపిస్తే దాక్షాయణి నిజ స్వరూపం తెలుస్తుంది అనుకుంటుంది. అదే టైంలో సామ్రాట్‌ కూడా ఒక్కసారి రామయ్యను పర్సనల్ గా కలిసి మాట్లాడాలి అనుకుంటాడు.

దాక్షాయణి ప్రేమగా జీవన్‌ కు భోజనం తినిపిస్తుంటే.. అందరూ ఆశ్చర్యపోతారు. మొదటిసారి జీవన్‌ను నువ్వు ఇలా చూస్తున్నావు అంటాడు కేశవ. నీలగిరి కూడా అదే విషయం అడిగితే.. తన ప్రేమ గురించి చెప్తుంది. ఇక క్వారీ లీజే పేపర్స్‌ గురించి అడుగుతాడు నీలగిరి. అక్కడే కూర్చుని భోజనం చేస్తున్న సామ్రాట్‌ మాత్రం అందరినీ అనుమానంగా చూస్తుంటాడు. రామయ్య చెప్పింది నిజమేనా..? జీవన్‌ నిజంగా తప్పు చేశాడా..? ఎప్పుడూ లేనిది అమ్మ జీవన్‌ మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తుంది అంటూ ఆలోచిస్తుంటాడు. చంద్ర మాత్రం వీలైనంత త్వరగా బావకు నిజం తెలిసేలా చేయాలి అనుకుంటుంది. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 7th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సుమిత్రకు నిజం తెలుస్తుందా..? సూరజ్ అడ్డుపడతాడా..?            

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Wedensday Tv Movies : బుధవారం సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ 4 మస్ట్ వాచ్..

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

Big Stories

Advertisement
×