BigTV English

CM Revanth Reddy Meeting: కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Meeting: కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy Meeting with Officials: రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ముగియటంతో ముఖ్యమంత్రి ప్రజా పాలనపై దృష్టి సారించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పునర్విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు మొదలు ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన పెండింగ్ అంశాలన్నింటిపై నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

షెడ్యూలు 9, షెడ్యూలు 10 లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించిన పంపిణీ అంశం, పలు అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి సంబంధించి, విద్యుత్తు సంస్థల బకాయిలతోపాటు పలు ఇతర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీల వంటి అంశాలు పూర్తి చేయాలని ఆదేశించారు.


Also Read: పాలనపైనే దృష్టంతా.. 13 ఎంపీ సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరినవాటిని పరిష్కరించుకోవాలని, పీటముడి పడిన అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. పదేండ్లు పూర్తవనుండటంతో పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మారనుంది. ఈ పదేండ్ల కాలానికి ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2 తర్వాత రాష్ట్ర అధీనంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పునర్విభజన చట్ట ప్రకారం పెండింగ్ లో ఉన్న అంశాలు, ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకున్న వివరాలపై సమగ్రమైన నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ నెల 18వ తేదీన శనివారం రాష్ట్ర కేబినేట్ సమావేశం జరగనున్నది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీతో పీటముడిగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా రైతుల రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై క్యాబినెట్లో ప్రధాన చర్చ జరగనున్నది.

Related News

Weather News: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త..!

KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే.. ఈ ఎలక్షన్ అంతా ఓ డ్రామా: కేటీఆర్

PC Ghosh Commission: అందుకే ఇదంతా.. మేడిగడ్డ కుంగుబాటు అసలు కారణం ఇదే: KCR

Rain Alert: బిగ్ అలర్ట్! మరో 3 రోజులు కుండపోత వర్షాలు.. ఎవరు బయటకు రావొద్దు..

Marwadi Controversy: మర్వాడీస్ రచ్చ.. అసలు కారణాలు ఇవే! ఎక్కడిదాకా వెళ్తోంది?

Lady Aghori: లేడీ అఘోరీ కాశీకి.. వర్షిణి ఇక అంతేనా? బయటికి వచ్చిన శ్రీనివాస్ కొత్త ప్లాన్స్ ఏమిటి?

Big Stories

×