Building Collapse: ఢిల్లీలో ముస్తాఫాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. నాలుగంతస్థుల భవనం ఉన్నట్టుండి కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకొంత మంది శిథిలాల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను రక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు పది మందిని వెలికి తీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. రాజధాని ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో.. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో.. ఉన్నట్టుండి భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వీడియో సీసీ కెమరాలో రికార్డు అయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే NDRF బృందాలు, అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని.. హుటాహుటిన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. ఇప్పటికే 18 మందిని రక్షించారు. 14 మందిని ఆస్పత్రికి తరలించారు.
గత వారం క్రితం ఢిల్లీలోని ఎన్‌సిఆర్ ప్రాంతంలో వేర్వేరు సంఘటనలలో – భవనం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
ఢిల్లీలోని మధు విహార్‌లోని ఓ భవనంలో ఆరవ అంతస్తులో నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో 67 ఏళ్ల వ్యక్తి మరణించాడు.
మరొక సంఘటన.. ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో మూడవ అంతస్తులో.. కొత్తగా నిర్మించిన బాల్కనీ కూలిపోవడంతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
ఇలా వరుస భవన నిర్మాణ ప్రమాదాలు జరగడంతో.. ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ.. ఎంత వరకు నిజం..? ఇదిగో కేంద్ర క్లారిటీ..
ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లోని అబిడ్స్ రామకృష్ణ థియేటర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే క్రేన్ ప్రమాదవశాత్తు కూలిపోయింది. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
కుప్పకూలిన భవనం.. నలుగురు మృతి..
ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా కూలిన నాలుగు అంతస్తుల భవనం
ప్రమాదంలో నలుగురు స్పాట్ డెత్
శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
కొనసాగుతున్న సహాయక చర్యలు pic.twitter.com/dP6uJsgZ8V
— BIG TV Breaking News (@bigtvtelugu) April 19, 2025