Rahul Gandhi: టాటా గ్రూప్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. టాటా గ్రూప్ ను నాశనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీని గురించి ఏ బిజినెస్‌మేన్ మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని అన్నారు. టాటా గ్రూప్ సామాజిక నిబద్ధత, యాజమాన్య విధానాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ రూటు మార్చారు. కేవలం రాజకీయాలు గురించి కాకుండా మిగతా అంశాలను సమయం, సందర్భాన్ని బట్టి నోరు విప్పుతున్నారు. తాజాగా టాటా గ్రూప్ గురించి నోరు ఎత్తారు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్‌ను కుట్ర పూరితంగా నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. ట్రస్ట్‌ను బలహీనపరిస్తే కంపెనీలు, అందులో పని చేసే ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందన్నారు.
టాటా సంస్థలో ఇంత జరగుతున్నా ఏ బిజినెస్‌మేన్ మాట్లాడే సాహసం చేయలేదన్నారు. ఇంకెంతకాలం మీరు మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. వారు మిమ్మల్ని సొంతం చేసుకునేంత వరకా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాలకు ఆట బొమ్మ కాదన్నారు. ప్రశ్నించేందుకు మీకు ధైర్యం లేదని సూటిగా ప్రశ్న లేవనెత్తారు. తగిన సమయంలో న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై అటు కేంద్రం గానీ, ఇటు టాటా గ్రూప్ గానీ నోరు మెదపలేదు.
ALSO READ: అర్నబ్ తుఫాను ప్రభావం.. తమిళనాడు-పుదుచ్చేరిలో భారీ వర్షాలు
టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాకు, ఆ గ్రూపు ప్రధాన హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ బోర్డుకు మధ్య విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థ టాటా ట్రస్ట్స్ హోల్డింగ్ కంపెనీ సెప్టెంబర్ 17 బోర్డు సమావేశం జరిగింది. అందులో ఎన్ చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ ఛైర్మన్‌గా తిరిగి నియమించే బోర్డు తీర్మానాన్ని టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా తప్పుబట్టిన విషయం తెల్సిందే. బోర్డు తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని, చెల్లుబాటు కాదని ట్రస్ట్స్ వాదన. ఈక్రమంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Tata is being criminally destroyed, and no business leader dares say a word.
How long will you stay silent? Until they own you?
Indian business is not Modi and Shah's plaything. You lack courage. We don't. We will ensure justice for these crimes.
— Rahul Gandhi (@RahulGandhi) October 28, 2026