BigTV English

Anusuya: పవన్ పిలిస్తే.. ఆ పని చేయడానికి నేను రెడీ

Anusuya: పవన్ పిలిస్తే.. ఆ పని చేయడానికి నేను రెడీ
Advertisement


Anusuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ను అనసూయ అందాలను చూడడానికి మాత్రమే చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ వదిలేసి.. సినిమాలతోనే బిజీగా మారింది. హీరోయిన్ గా, విలన్ గా,సపోర్టివ్ రోల్స్ లో చేస్తూ బిజీగా మారింది. ఇక అనసూయ సోషల్ మీడియాలో ఏ రేంజ్ సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంటీ వివాదం, ది వివాదం, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. ఇక ఈ మధ్యనే ఈ ముద్దుగుమ్మ కొంచెం నిదానించింది.

ఇక వీలు చిక్కినప్పుడల్లా తనకు నచ్చని విషయం గురించి సోషల్ మీడియాలో పంచుకోవడం, హాట్ ఫొటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కించడం అమ్మడికున్న అలవాటు. ఇవన్నీ పక్కన పెడితే.. మొట్టమొదటిసారి అనసూయ రాజకీయ ప్రచారం గురించి మాట్లాడింది. అది కూడా పవన్ పిలిస్తే జనసేన తరుపున ప్రచారం చేయడానికి సిద్ధమని చెప్పుకొచ్చింది. ” నాకు రాజకీయాలు అంటే పడవు. మా నాన్న రాజకీయాల్లో ఉండేవారు. నా వలనే ఆయన బయటకు వచ్చారు. ఒకవేళ పొలిటికల్ పార్టీల ప్రచారాలకు పిలిస్తే వెళ్తాను. నాకు పార్టీలు ముఖ్యం కాదు లీడర్స్ ముఖ్యం. వారు అజెండా నచ్చితే కచ్చితంగా ప్రచారం చేస్తాను. పవన్ కళ్యాణ్ పిలిస్తే జనసేన తరుపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది.


ఇక అనసూయకు గతంలో పవన్ సినిమాలో ఆఫర్ వచ్చినా ఆమె సున్నితంగా తిరస్కరించిన విషయం అందరికి తెల్సిందే. ఒకసారి కాదు రెండుసార్లు అను.. పవన్ సినిమాలో నటించే ఛాన్స్ ను తిరస్కరించింది. ఇక అలాంటింది ఆమె రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం ఏంటి.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక ఇదంతా పక్కన పెడితే.. అనసూయను పవన్ పిలుస్తాడా.. ? లేదా.. ? అనే అనుమానం కూడా ఫ్యాన్స్ లో ఉంది. జనసేన లో ఇప్పటికే జబర్దస్త్ టీమ్ లో ఉన్నవారందరూ ఉన్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఇలా నాగబాబు అనుచరులు అని చెప్పుకుంటూ ఉండే వీరుతో పాటే నాగబాబుకు, అనసూయకు మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. ప్రచారానికి అనసూయ ఉపయోగపడుతుంది అనుకుంటే.. నాగబాబు కచ్చితంగా అనసూయను ప్రచారానికి తిప్పుతారు. మరి ఈ విషయమై పవన్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

Related News

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Big Stories

×