Fire Accident: తమిళనాడులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు సజీవదహనమయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 32 మందిని రెస్క్యూ చేశారు.
మృతి చెందిన వారంతా హాస్పిటల్ లిఫ్ట్ లోనే ఉన్నట్టు గుర్తించాయి రెస్క్యూ టీమ్స్.
వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి 10 గంటల సమయంలో.. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నాలుగు అంతస్థులు భవనమన్న ఈ ఆస్పత్రిలో ఫస్ట్ ఫ్లోర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అసలు ఏం అయిందో తెలుసుకునే లోపే మంటలు వార్డులకు వ్యాపించాయి. దీంతో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న ముగ్గురు మహిళలు.. ఒక బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, పైర్ సిబ్బంది రెస్కూ చేశారు. ఈ ఘటనలో సుమారు ఏడుగురు సజీవదహనం అయ్యారు. 20 మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో రోగులే ఎక్కువగా ఉన్నట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చాలా సేపు వరకు మంటలు అదుపులోకి రాలేదు.. ఈ ప్రమాదానికి కారణం షాట్ సర్క్యూటే అని పోలీసులు విచారణలో తెలసింది.
Also Read: హాత్రస్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్.. విమర్శించిన బిజేపీ
ఇదిలా ఉంటే..హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్ బాగ్ ప్రాంతంలో జనవాసాల నడుమ ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్‌కి సైతం మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. షాట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు.