BigTV English
Advertisement

Fireworks Factory blast at Sivakasi: శివకాశిలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు వెనుక ఏం జరిగింది..? కారణం ఇదేనా..?

Fireworks Factory blast at Sivakasi: శివకాశిలో క్రాకర్స్ ఫ్యాక్టరీలో పేలుడు వెనుక ఏం జరిగింది..? కారణం ఇదేనా..?

Fireworks factory blast at Tamil Nadu’s Sivakasi: తమిళనాడులోని శివకాశి పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది బాణా సంచా ఫ్యాక్టరీలు. అక్కడ ఇదో పెద్ద ఇండస్ట్రీ. తమిళనాడు వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పనుల కోసం కార్మికులు ఇక్కడకు వస్తుంటారు. దేశవ్యాప్తంగా దీపావళికి ఫైర్ క్రాకర్స్ ఇక్కడి నుంచే సరఫరా అవుతాయి. అందుకు ఇప్పటినుంచే పనిలో నిమగ్నమవుతారు కంపెనీ యాజమానులు, సిబ్బంది.


వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డర్ల నేపథ్యంలో కూలీలను రప్పించుకుని పనులు చేయిస్తాయి సంబంధిత కంపెనీల యాజమాన్యాలు. కనీసం అవగాహన లేని కార్మికులను ఇక్కడి రప్పించి పనుల్లో పెడతాడు. ఫలితంగా వందల సంఖ్యలో కూలీలు మరణించిన సందర్భాలు లేక పోలేదు. తాజాగా విరుదునగర్ జిల్లా శివకాశీలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

డజనుకు పైగానే కార్మికులు గాయపడినట్టు తెలుస్తోంది. శ్రీ సుదర్శన్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కెమికల్స్ మిక్సింగ్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించిందని క్షతగ్రాతులు చెబుతున్నమాట. ఈ పేలుడు ధాటికి బాణాసంచా ఫ్యాక్టరీలోని ఆరుకు పైగా గదులు ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం కూడా భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఘటన గురించి సమాచారం తెలుసుకోగానే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


Also Read: Weather Updates: బెజవాడను ముంచెత్తిన వాన.. నేడు కూడా..

గాయాల పాలైన వారిని సమీపంంలోని ఆసుపత్రికి తరలించారు. అటు పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పేలుడు సంభవించడానికి గల కారణాలపై దృష్టిపెట్టారు. ఈ కంపెనీ లైసెన్సు 2026 వరకు గడువు ఉన్నట్లు తెలుస్తోంది. శిక్షణ లేని కార్మికులు పనిలో నిమగ్నం కావడంవల్లే ఈ ఘటన జరిగిందన్నది పోలీసుల అనుమానం. మూడురోజుల కిందట ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీల్లో పని చేసే   కార్మికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు పోలీసులు. ఇంతలోనే ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

అంతేకాదు జిల్లా అధికారుల యంత్రాంగం నిత్యం భద్రత గురించి సమావేశాలు పెడతారు. ఎవరైనా రూల్స్ అధిగమిస్తున్నారా అనేదానిపై తరచూ తనిఖీలు చేపడతారు. కెమికల్స్ మిక్సింగ్ సమయంలో ఒక్కో కార్మికుడికి దాదాపు అర కిలోపైగానే మెటీరియల్ ఇవ్వడం, నైపుణ్యం లేని కార్మికులతో ఈ తరహా పనులు చేయించడం కూడా ప్రమాదానికి కారణమైనట్లు నిఫుణులు చెబుతున్నమాట. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు పోలీసులు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఘటనలో దాదాపు 27 మంది చనిపోయారు.

Also Read: Cash Seizure: తవుడు బస్తాల మధ్య 7 కోట్లు.. సినీ తరహాలో తరలింపు.. చివరికి..?

Tags

Related News

Delhi Blast: ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో పేలుడు.. దేశవ్యాప్తంగా హై అలర్ట్

Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు.. ఐదు కార్లు ధ్వంసం.. 8 మంది మృతి

Terrorists Arrest: లేడీ డాక్టర్ సాయంతో తీవ్రవాదుల భారీ ప్లాన్.. 12 సూట్ కేసులు, 20 టైమర్లు, రైఫిల్ స్వాధీనం.. ఎక్కడంటే?

Delhi Air Emergency : శ్వాస ఆగుతోంది మహాప్రభూ.. రోడ్డెక్కిన దిల్లీవాసులు.. పిల్లలు, మహిళలు సైతం అరెస్ట్?

New Aadhaar App: కొత్త ఆధార్ యాప్ వచ్చేసిందోచ్.. ఇకపై అన్నీ అందులోనే, ఆ భయం అవసరం లేదు

UP Lovers Incident: UPలో దారుణం.. లవర్‌ను గన్‌తో కాల్చి.. తర్వాత ప్రియుడు కూడా..

Bengaluru Central Jail: బెంగళూరు సెంట్రల్ జైలు.. ఖైదీలు ఓ రేంజ్‌లో పార్టీ, ఐసిస్ రిక్రూటర్ కూడా

Nara Lokesh: బీహార్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రస్తావన.. లోకేష్ కౌంటర్లు మామూలుగా లేవు

Big Stories

×