BigTV English

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

9 People died in Bihar Road Accident: బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Bihar Road accident
Bihar Road accident

9 People died in Bihar Road Accident: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ట్రక్కు, జీపు, మోటార్‌సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేగంగా వస్తున్న జీప్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది, రెండు వాహనాలు ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మృతి చెందారు.


“ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఇద్దరు మహిళలతో సహా ఎనిమిది మందితో కూడిన జీపు.. మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. జీప్‌పై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఢీకొన్నట్లు తెలుస్తోంది” అని మోహానియా డీఎస్పీ దిలీప్‌కుమార్ తెలిపారు.

కాగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు అవసరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Read More: Nafe Singh Rathi: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ప్రెసిడెంట్ దారుణ హత్య..

“కైమూర్‌లోని మోహానియా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం తన తీవ్ర వేదనను వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు” అని సీఎం కార్యాలయం ఆదివారం అర్థరాత్రి ప్రకటన విడుదల చేసింది.

Tags

Related News

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Big Stories

×