Big Stories

9 Babies Dead: 24 గంటల్లో 9 మంది శిశువులు మృతి.. ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?

9 Babies Dead: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 24 గంటల్లో ఏకంగా 9 మంది శిశువులు మృతి చెందడం తీవ్రకలకలం రేపుతోంది. వీరితో పాటు రెండేళ్ల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘోర దుర్ఘటన పశ్చిమ్ బెంగాల్ లోని ముర్షిదాబాద్ వైద్య కళాశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మమతా సర్కార్ సీరియస్ అయింది. చిన్నారుల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది.

- Advertisement -

ప్రాథమిక నివేదిక ప్రకారం.. మృతి చెందిన చిన్నారులు పోషకాహార లోపం, అతి తక్కువ బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒక చిన్నారి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటుందని సమాచారం. మృతి చెందిన శిశువులలో ముగ్గురు ముర్షిదాబాద్ వైద్య కళాశాలలోనే పుట్టగా.. మిగతా ఆరుగురు శిశువులును చుట్టుపక్క ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరేసరికే వారి ఆరోగ్యం క్షీణించిందన్నారు.

- Advertisement -

జాంగిపుర్ సబ్ డివిజినల్ ఆస్పత్రిలో కొద్దిరోజులుగా పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అందుకే చిన్నారులను ముర్షిదాబాద్ కు రిఫర్ చేశారని సంబంధిత అధికారులు మీడియాకు వెల్లడించారు. నెలరోజుల్లోనే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 380 మంది శిశువులను మెరుగైన చికిత్స కోసం ముర్షిదాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. 24 గంటల్లో 9 మంది శిశువులు మరణించడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News