E-Paper
Advertisement

జైలులో ప్రజ్వల్ రాజభోగాలకు చెక్.. ఫోన్‌లో 90 ఏకాంత వీడియోలు, షాకైన అధికారులు

జైలులో ప్రజ్వల్ రాజభోగాలకు చెక్.. ఫోన్‌లో 90 ఏకాంత వీడియోలు, షాకైన అధికారులు
Advertisement

Bengaluru: అత్యాచార కేసులో జైలు జీవితం అనుభవిస్తున్నారు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ్. ఆయనకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా ఆయన గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయన ఆ పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఫోన్ లో ఏకంగా 90 వరకు ఏకాంత వీడియోలు దర్శనమీయడం కలకలం రేపింది.

జైలులో ప్రజ్వల్ రాజభోగాలకు చెక్

అత్యాచారం కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు జేడీఎస్ పార్టీ మాజీ ఎంపీ ప్రజ్జ్వల్ రేవణ్ణ్. జైలులో ఖైదీల వద్ద ఫోన్లు ఉంటున్నాయన్న సమాచారంతో ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆదేశాలతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు పరప్పన అగ్రహార జైలులో ఆకస్మిక దాడులు చేపట్టారు. సీఎం అనుమతితో దాడులకు ఆదేశాలిచ్చానని హోంమంత్రి స్వయంగా వెల్లడించారు. ఈ దాడుల్లో ప్రజ్వల్ బ్యారక్‌ సహా మొత్తం 10కి పైగా మొబైల్ ఫోన్లు దొరికాయి. ప్రజ్వల్ నుంచి ఓ మొబైల్ ఫోన్, ఛార్జర్, పెన్‌డ్రైవ్‌తోపాటు ఓ నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

 

ఫోన్‌లో 90 ఏకాంత వీడియోలు

ఫోన్‌ను పరిశీలించగా అందులో 80 నుంచి 90 వరకు డౌన్‌లోడ్ చేసిన ఏకాంత వీడియోలు కనిపించాయి. అవి చూసి అధికారులు షాకయ్యారు. ఆ కంటెంట్‌లో అధిక భాగం భారతీయులకు సంబంధించి చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ ఫోన్‌లో ఇలాంటివి చాలావరకు ఉన్నాయని గుర్తించారట. స్వాధీనం చేసుకున్న ఫోన్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. అందులో ఉన్న అన్ని వీడియో ఫైల్‌లు, చిత్రాలు, ఇతర డిజిటల్ డేటా, రేవన్నకు ఉన్న సంబంధాన్ని నిర్ధారించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. సోదాలు తర్వాత జైలు అధికారులపై చర్యలు చేపట్టారు. జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేయగా, బెంగళూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌కు షో-కాజ్ నోటీసు జారీ చేశారు ఉన్నతాధికారులు.

Advertisement

 

ఈ వ్యవహారం ఎలా బయటపడింది?

ప్రజ్వల్ ఉంటున్న వీఐపీ సెల్‌లో జైలు నిబంధనలకు విరుద్ధంగా నార్మల్ దుస్తులు ధరించి, ఫ్యాన్ గదిలో మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ వీడియోకు సంబంధించి 17 నిమిషాల క్లిప్ వెలుగులోకి రావడంతో జైలులో ఆయనకు అందుతున్న సౌకర్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు సోదాలు చేపట్టారు. స్వాధీనం తర్వాత కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ జైలులో ప్రతాప్ రాయ్ అనే విచారణ ఖైదీని ఈ కేసులో చేర్చారు.

ALSO READ: నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక, 20 వేల పేజీలతో సీబీఐ ఛార్జిషీట్

2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రేవణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు బయటపడ్డాయి. అవన్నీ మార్ఫింగ్ వీడియోలు అంటూ ఆరోపణలు చేశారు. 2024 ఏప్రిల్ 28 నుండి జూన్ 10 మధ్య అతడిపై నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. బెంగళూరులోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదైన విషయం తెల్సిందే.

Related News

భర్తపై ద్వేషం-ప్రియుడిపై ప్రేమ.. భార్య ఏం చేసిందో తెలుసా? విద్యుత్ షాక్ ఇచ్చి.. ఢిల్లీలో దారుణం

నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక.. 360 మంది సాక్షులు, 20వేల పేజీలతో సీబీఐ ఛార్జ్‌షీట్!

నోట్ల కట్టల కేసులో మాజీ జడ్జికి బిగ్ షాక్.. దోషిగా తేల్చిన కమిటీ.. నివేదికలో షాకింగ్ విషయాలు!

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!

యూట్యూబర్‌కు బిగ్ షాక్.. పెళ్లి అయిన ఏడాదికే.. కండక్టర్‌తో భార్య జంప్!

1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!

QS Rankings 2027: ప్రపంచ విద్యా ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్-205లో నాలుగు ఐఐటీలు, ప్రైవేటు విద్యాసంస్థలూ..

Big Stories

Advertisement
×