Big Stories

Illeagal Child Transport : పిల్లల అక్రమ రవాణా.. 95 మందిని రక్షించిన చైల్డ్ కమిషన్

95 children rescued in uttarpradesh : పిల్లల్ని అక్రమ రవాణాను ఉత్తరప్రదేశ్ కు చెందిన చైల్డ్ కమిషన్ చేధించింది. బిహార్ నుంచి యూపీకి అక్రమంగా తీసుకెళ్తున్న 95 మంది పిల్లల్ని రక్షించింది. చైల్డ్ కమిషన్ సభ్యుడు సుచిత్ర చతుర్వేది ఇచ్చిన సమాచారంతో పిల్లల్ని రక్షించినట్లు అయోధ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ సర్వేష్ అవస్తి వెల్లడించారు. బిహార్ నుంచి సహారన్ పూర్ కు పిల్లల్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని, అయోధ్య మీదుగా వారిని తరలిస్తున్నారని సమాచారమిచ్చారు. ఆ సమాచారంతో పిల్లల్ని రక్షించగా.. ఆ పిల్లలంతా 4 నుంచి 12 సంవత్సరాల లోపు వయసువారేనని తెలిపారు.

- Advertisement -

పిల్లలను రవాణా చేస్తున్న వారి దగ్గర.. తల్లిదండ్రుల అంగీకార పత్రాలు లేవని గుర్తించినట్లు చెప్పారు. ఆ పిల్లల తల్లిదండ్రులెవరో తెలుసుకుని.. త్వరలోనే వారిని ఇంటికి చేరుస్తామన్నారు. గతంలోనూ బిహార్ నుంచి మదర్సాలకు పిల్లల్ని తరలిస్తుండగా.. వారిని కూడా యూపీ చైల్డ్ కమిషన్ రక్షించింది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇచ్చిన సమాచారంతో ఆ పిల్లల్ను రక్షించారు.

- Advertisement -

Also Read : విషాదం.. మహిళా రైతుతోపాటు మరొకరిని చంపేసిన ఏనుగు?

భారత రాజ్యాంగం ప్రతి చిన్నారికి చదువుకునే హక్కును కల్పించింది. ప్రతి చిన్నారి బడికెళ్లడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో పేద పిల్లల్ని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి.. మదర్సాలలో ఉంచి మతం ఆధారంగా విరాళాలు పొందుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో రాశారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News