BigTV English

Pushpa – Suhas: పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ మొదట సుహాస్‌‌ని అనుకున్నాం: సుకుమార్

Pushpa – Suhas: పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ మొదట సుహాస్‌‌ని అనుకున్నాం: సుకుమార్

Director Sukumar about Suhas(Cinema news in telugu): ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. ఇందులో బన్నీ మ్యానరిజానికి ఫ్యాన్సే కాదు యావత్ సినీ ప్రియులు సైతం ఫిదా అయిపోయారు. ఈ మూవీ పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కలేదు. అయినా వరల్డ్ వైడ్‌గా మాత్రం తన హవా చూపించింది.


ముఖ్యంగా ఈ మూవీలో బన్నీ, కేశవ కాంబినేషన్ సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో మొత్తం కామెడీ కామెడీ సీన్లతో వీరిద్దరి బాండింగ్ చాలా బాగా ఉంటుంది. అయితే రష్మిక (శ్రీవల్లి)తో మాట్లాడేందుకు బన్నీ ఎంతో తాపత్రయ పడతాడు. ఒకరకంగా రియల్ లైఫ్‌లో వన్ సైడ్ లవ్ ఎలా ఉంటుందో అలానే సినిమాలో చూపించాడు దర్శకుడు. శ్రీవల్లి వెంట పడటం, నవ్విందా, చూసిందా అని బన్నీ.. కేశవను అడగడం ఇలా ప్రతీదీ చాలా బాగా చూపించాడు.

అయితే ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి ఎర్రచందనం స్మగ్లింగ్‌తో బన్నీ పాట్లు పడుతుంటాడు. దాన్ని ఎక్కడికి చేరవేయాలి. ఎలా చేరవేయాలి. పోలీసుల నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇలా అన్ని సీన్లలో బన్నీతో కేశవ ఉంటూ సహాయపడతాడు. అయితే ఈ మూవీలో కేశవ క్యారెక్టర్ కోసం మొదట నటుడు కేశవను అనుకోలేదట మేకర్స్.


Also Read: సస్పెన్స్ థ్రిల్లర్‌గా సుహాస్ ‘ప్రసన్న వదనం’ ట్రైలర్..

ఇదే విషయాన్ని తాజాగా దర్శకుడు సుకుమార్ ఓ ఈవెంట్లో తెలిపాడు. ఇప్పుడిప్పుడే హీరోగా మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు సుహాస్ ఇప్పుడు ‘ప్రసన్నవదనం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ని శుక్రవారం (ఏప్రిల్ 26)న రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌కి దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా వచ్చాడు.

ఈ ఈవెంట్‌లో సుకుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను తెరకెక్కించిన ‘పుష్ప’ మూవీలో కేశవ క్యారెక్టర్ మొదట సుహాస్‌ని అనుకున్నామని అన్నాడు. అయితే అప్పటికి అతను హీరోగా సినిమా చేస్తున్నాడు అని తెలిసి పుష్ప మూవీలో పెట్టుకోలేదని అన్నాడు. దీంతో చాలా మంది పుష్ప మూవీలో ముందుగా సుహాస్‌ని అనుకున్నారా అని చర్చించుకుంటున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×