E-Paper
Advertisement

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!
Advertisement

Reasi Road Accident: జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ ప్రాంతంలోని ప్రమాదకరమైన రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలుకావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రమాదం జరిగిన తీరు

Advertisement

ప్రమాదానికి గురైన వాహనం థనోల్ గ్రామం నుండి థుబ్ గ్రామానికి బయలుదేరింది. ఆ ప్రాంతమంతా ఎత్తైన పర్వతాలు, ఇరుకైన ఘాట్ రోడ్లతో నిండి ఉంటుంది. మార్గమధ్యంలో ఓ ప్రమాదకరమైన మలుపు వద్ద వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. కన్నుమూసి తెరిచేలోపే వాహనం అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయి నుజ్జునుజ్జయ్యింది.

మృతుల వివరాలు.. సహాయక చర్యలు

Advertisement

ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులు ప్రేమ్ సింగ్ (50), ఆయన భార్య తురి దేవి సహా మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అత్యంత కష్టపడి క్షతగాత్రులను లోయలోంచి బయటకు తీసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఇద్దరినీ మెరుగైన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×