E-Paper
Advertisement

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు

తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. సీఎం విజయ్ యూటర్న్.. వివాదస్పద ఉత్తర్వులు రద్దు
Advertisement

Vijay Government: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వామపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండే నిరోధించేలా ఇచ్చిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఈ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవ్వడంతో టీవీకే ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది.

వివాదానికి నేపథ్యం

కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసన ప్రదర్శనల్లో విద్యార్థులు చేరకుండా చూడాలని విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఆగస్టు 14న వివిధ శాఖలకు, జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కళాశాల విద్యాశాఖ ఆగస్టు 17న అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లకు లేఖలు పంపింది. విద్యార్థులు రాజకీయ ఆందోళనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు పోలీసుల సాయం సైతం తీసుకునేందుకు వెనుకాడవద్దని సూచించింది. ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మండిపడ్డ ప్రతిపక్షాలు, సీజేపీ

Advertisement

అయితే విద్యార్థులు నిరసన తెలపకుండా ఇచ్చిన ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వ ఆదేశాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయని మండిపడింది. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు స్టూడెంట్స్ పై నిఘా పెట్టేందుకు విద్యా సంస్థలను, పోలీసు వ్యవస్థను ఉపయోగించడాన్ని అనేక వర్గాలు సైతం తప్పుబట్టాయి.

Also Read: కస్టమర్లకు Zepto బిగ్ షాక్.. ఫ్రీ డెలివరీ పరిమితి పెంపు.. కనీస ఆర్డర్ ఎంతంటే?

వెనక్కి తగ్గిన ప్రభుత్వం

Advertisement

ఈ ఉత్తర్వుపై రాజకీయంగా దుమారం రేగడంతో విజయ్ ప్రభుత్వం పునరాలోచన పడింది. వివాదస్పద ఉత్తర్వును వెనక్కి తీసుకునేందుకే మెుగ్గుచూపింది. దీంతో కాలేజీ విద్యాశాఖ తన ఆదేశాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 17న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు కాలేజీ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడులోని అన్ని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు మరో లేఖను పంపారు. దీంతో ఈ వివాదాస్పద ఉత్వర్వులకు ముగింపు పడినట్లయింది. టీవీకే సర్కార్ నిర్ణయం పట్ల విద్యార్థులు, యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: గుడి లాంటి అసెంబ్లీని బహిష్కరిస్తారా? చరిత్రలో ఎక్కడైనా ఉందా.. వైసీపీపై చంద్రబాబు ఫైర్!

Tags

Related News

లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

పిజ్జా సెంటర్‌లో కాల్పులు.. 3 సెకన్లలో 3 రౌండ్లు.. నెట్టింట వీడియో వైరల్!

సీఎం విజయ్ బంపరాఫర్.. ఎమ్మెల్యేలకు ఉచిత కారు.. నెలకు రూ.లక్ష అలవెన్స్!

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!

కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!

కోల్‌కతా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది బంగ్లాదేశీయుల మృతి, 6 గురికి గాయాలు

ఇతనేం సీఎం అయ్యా.. పొద్దున్నే 4 గంటలకు లేపేస్తున్నాడు.. విజయ్ రూటే సెపరేటు!

Big Stories

Advertisement
×