E-Paper
Advertisement

కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!

కర్ణాటకలో కాల్పుల కలకలం.. తమిళనాడుకు చెందిన ముగ్గురి మృతి!
Advertisement

Karnataka- Tamil Nadu: కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు జిల్లా అయిన చామరాజనగర్‌ పరిధిలోని కావేరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఆంథోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.

అటవీశాఖ ఏం చెప్తోందంటే..?

Advertisement

కర్ణాటక అటవీశాఖ అధికారుల వివరణ ప్రకారం.. కొంతమంది వ్యక్తులు వేటాడటానికి లేదా అనుమానాస్పద కార్యకలాపాల కోసం అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించారు. గస్తీ కాస్తున్న అటవీ సిబ్బంది వారిని అడ్డుకోవడానికి యత్నించగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తమ ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఇది యాంటీ-పోచింగ్ చర్యల్లో భాగమేనని అధికారులు వివరణ ఇచ్చారు.

తీవ్రంగా ఖండిస్తున్న కుటుంబాలు, తమిళనాడు పార్టీలు

Advertisement

అయితే అటవీశాఖ వాదనను మృతుల కుటుంబ సభ్యులు, తమిళనాడులోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వారు వేటకు వెళ్లలేదని, కేవలం జీవనోపాధి కోసం సరిహద్దు నదీ ప్రాంతానికి చేపల వేటకు మాత్రమే వెళ్లారని స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి ఆయుధాలు లేని నిరాయుధులపై కర్ణాటక అటవీ సిబ్బంది అతిగా ప్రవర్తించి, నిష్కారణంగా కాల్పులు జరిపారని ఆరోపిస్తున్నారు.

సీఎం విజయ్ ఆగ్రహం..

ఈ తీవ్ర ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఈ ముగ్గురు తమిళుల మృతిని ఒక ‘కిరాతక హత్య’గా అభివర్ణించిన ఆయన, కర్ణాటక అటవీశాఖ ఇచ్చిన యాంటీ-పోచింగ్ వివరణను పూర్తిగా తిరస్కరించారు. ఈ ఘటనపై తక్షణమే పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: రూపారెడ్డి మర్డర్ కేస్‌లో ఊహించని ట్విస్ట్.. విద్యార్థులే నిందితులా?

Tags

Related News

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

ప్లాన్ ప్రకారమే పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!

హక్కుల పోరాటానికి డిజిటల్ వేదిక.. రాహుల్ గాంధీ సత్యాగ్రహ పోర్టల్ ప్రారంభం!

ప్రియుడితో కూతురు జంప్.. చెప్పు తీసుకొని.. యువకుడి తండ్రిపై యువతి తల్లి దాడి!

కెనెరా బ్యాంక్‌లో ఉద్యోగాలు.. 3500 అప్రెంటిస్ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

రోడ్‌షోలో ఎమోషనల్ మూమెంట్.. కొడుకు ఫోటోను పైకెత్తి చూపిన సీఎం విజయ్.. దృశ్యాలు వైరల్!

Big Stories

Advertisement
×