E-Paper
Advertisement

అలాంటి హిజ్రాలతో జాగ్రత్త.. తేడా వస్తే కొంప కొల్లేరు, అసలు ఏం జరిగింది?

అలాంటి హిజ్రాలతో జాగ్రత్త.. తేడా వస్తే కొంప కొల్లేరు, అసలు ఏం జరిగింది?
Advertisement

Mumbai: ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తూ ఓ ఇంట్లోకి చొరబడ్డాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఇంట్లోనే మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాకింగ్ ఘటన ముంబై సిటీలో చోటు చేసుకుంది. అది కూడా ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో రెండు రోజుల కిందట జరిగింది. చివరకు నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఘటన వెనుక ఏం జరిగింది?

 

ముంబైలో ఊహించని ఘటన

Advertisement

పోలీసుల వివరాల ప్రకారం.. సెంట్రల్ ముంబైలోని పోవై ప్రాంతం. ఆ ప్రాంతంలో అధిక భాగం విలాసవంతమైన అపార్ట్‌మెంటులకు కేరాఫ్‌గా చెబుతుంటారు ఆ ప్రాంతవాసులు. 28 ఏళ్ల అనిల్ శేషారావు షిండే.. ఆ ప్రాంతంలోని ఓ ఇంటిపై కన్ను పడింది. ఎలాగైనా ఓ మహిళను వశపరుచుకోవాలని భావించాడు. అందుకు కొత్త గెటప్‌ని ఎంపిక చేసుకున్నాడు. ట్రాన్స్‌జెండర్‌ అని చెప్పి పోవైలోని ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించాడు శేషారవు షిండే. ఇంట్లో అనారోగ్యంతో ఉన్నవారికి దిష్టి తీస్తానని అందులోని వారిని నమ్మించాడు. అంతేకాుద పిల్లలు లేనివారికి పూజలు చేస్తానని నమ్మించి లోపలికి ఎంట్రీ ఇచ్చాడు.

 

హిజ్రా పేరుతో ఇంట్లోకి ఎంట్రీ

Advertisement

ఈ క్రమంలో ఓ అపార్ట్‌మెంటు ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత హిజ్రా, సదరు మహిళను బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. పూజ చేస్తున్నట్లు నటిస్తూ ఆమె తలపై చేయి పెట్టి, నీళ్లు చల్లి కింద పడుకోమని చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా సదరు మహిళ షాకైంది. ఇంట్లో నుంచి కొంత డబ్బు తీసుకుని పారిపోయాడు శేషారావు. కాసేపటికి తేరుకున్న బాధిత మహిళ, పోవై పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడికి వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. బాధితురాలు చెప్పిన వివరాలు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసు కోసం సుమారు 100 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించారు.

 

మహిళపై అత్యాచారం, డబ్బు దోచుకెళ్లిన నిందితుడు

నిందితుడు ఆటోలో థానేలోని కల్వా ప్రాంతానికి పారిపోయినట్లు గుర్తించారు పోలీసులు. ఆగస్టు 20న తెల్లవారుజామున అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులు విచారణలో అసలు విషయాలు బయటపెట్టాడు. తాను ట్రాన్స్‌జెండర్‌ కాదని, పురుషుడేనని బయటపెట్టాడు. గతంలో శేషారావు ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు చేస్తున్నారు పోలీసులు. దోచుకెళ్లిన డబ్బు గురించి ఆరా తీశారు. నిందితుడు ట్రాన్స్‌జెండర్‌గా, బిచ్చగాడిలా నటించాడని తెలిపారు పోలీసులు. ఆ తరహాలో ఘటనలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులను తమ ఇళ్లలోకి అనుమతించవద్దని వారు కోరారు.

ALSO READ: ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్

Related News

స్కూళ్లలో రాజ్యాంగ పీఠికను తప్పనిసరి చేయలేం.. సుప్రీంకోర్టు సంచలనం!

సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీలు.. ముగ్గురి చేత సీజేఐ ప్రమాణ స్వీకారం.. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య!

టీవీ కోసం గొడవ.. కూతుర్ని బ్యాటుతో కొట్టి చంపిన తండ్రి.. విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు!

ఆప్ నేతకు మహిళ బిగ్ షాక్.. ప్రభుత్వ ఉద్యోగినని చెప్పి పెళ్లి.. ఆపై ఇంట్లోని బంగారంతో జంప్!

పబ్‌జీ గేమ్ టాస్క్.. ఇల్లు వదిలి పారిపోయిన 14 ఏళ్ల బాలుడు.. పోలీసులు ఏం చేశారంటే?

సరిగా చదవలేదని అమానుష ఘటన.. 82 మంది విద్యార్థులకు అరగుండు, మహారాష్ట్రలో దారుణం

భారతీయుల కిడ్నాప్.. డబ్బులు డిమాండ్ చేయకుండా, ఫ్లైట్ టికెట్లు తీసి మరి వదిలిపెట్టిన వైనం.. ఎందుకంటే?

10 సీఎన్‌జీ బస్సులు దగ్ధం.. షార్ట్ సర్క్యూట్ కారణమా? ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×