E-Paper
Advertisement

నెట్‌ఫ్లిక్స్ కోసం విడిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగానే చూడొచ్చు!

నెట్‌ఫ్లిక్స్ కోసం విడిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారా? ఈ రీఛార్జ్ ప్లాన్లతో ఉచితంగానే చూడొచ్చు!
Advertisement

Best OTT Recharge Plans: మొబైల్ రీఛార్జ్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ వంటి పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పండి? విడిగా నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ తీసుకునే పనిలేకుండా దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చాయి. ఉచిత కాలింగ్, డేటాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.

Jio నెట్‌ఫ్లిక్స్ రీఛార్జ్ ఆప్షన్స్..

జియో నెట్‌ఫ్లిక్స్ ప్రియుల కోసం రెండు రకాల ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో రీఛార్జ్ చేయాలనుకునే వారికి రూ.1,299 ప్లాన్ ఒక మంచి ఆప్షన్. ఇది 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలను ఇస్తుంది. దీని ద్వారా నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఒకవేళ మీరు టీవీ లేదా ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్ చూడాలనుకుంటే.. రూ.1,799 ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో రోజుకు 3GB డేటాతో పాటు టీవీలకు సపోర్ట్ చేసే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ వస్తుంది.

Advertisement

Also Read: షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

Airtel బెస్ట్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్..

ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ.1,798 ధరలో ప్రత్యేక ప్లాన్‌ను అందుబాటులో ఉంచింది. ఈ రీఛార్జ్‌ ద్వారా 84 రోజుల పాటు రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజువారీ SMSలు అందుతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే.. దీనిలో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా.. ఎలిజిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది.

తక్కువ ధరకే Vi నెట్‌ఫ్లిక్స్ ఆఫర్లు..

Advertisement

తక్కువ ధరలోనే నెట్‌ఫ్లిక్స్ పొందేందుకు Vi రూ.1,198 ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటాను ఇస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ రావడం గొప్ప ప్లస్ పాయింట్. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం రూ.1,599 ప్లాన్ ఉంది. ఇది 84 రోజుల పాటు రోజుకు 2.5GB డేటాను అందించడమే కాకుండా ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ బెనిఫిట్‌ను ఇస్తుంది.

ఎవరికి ఏ ప్లాన్ సరిపోతుందంటే?

ప్రస్తుతం ఉన్న ప్లాన్లలో Viకి చెందిన రూ.1,198 రీఛార్జ్ తక్కువ ధరలో లభిస్తున్న ఆప్షన్. అయితే ఎక్కువ డేటా వాడుతూ.. టీవీలు లేదా పెద్ద స్క్రీన్లపై నెట్‌ఫ్లిక్స్ చూడాలనుకునే వారికి జియో రూ.1,799 లేదా ఎయిర్‌టెల్ రూ.1,798 ప్లాన్లు సరైన ఎంపికగా నిలుస్తాయి. మీ రోజువారీ డేటా అవసరాలు, బడ్జెట్‌ను బట్టి వీటిలో మీకు తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. రీఛార్జ్ చేసే ముందు మీ ఏరియాలో 5G నెట్‌వర్క్ ఉందో లేదో, కంపెనీ నిబంధనలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: యాపిల్ ప్రియులకు మళ్లీ నిరాశే.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వచ్చేది అప్పుడేనట!

Tags

Related News

మార్కెట్లోకి వివో కొత్త ఫోన్.. ఆండ్రాయిడ్ 16, 8GB ర్యామ్‌తో గీక్‌బెంచ్‌లో లీక్!

షావోమి ఫోన్లలో ఐఫోన్ తరహా గ్లాస్ డిజైన్.. మీ మోడల్ ఉందో లేదో చెక్ చేసుకోండి!

రూ.21,799కే..50 ఇంచుల టీవీ, ఆఫర్ ఉన్నప్పుడే కొనేయండి

తక్కువ బడ్జెట్‌లో..అదిరిపోయే మిక్సీ కావాలా?

ట్రెండీ లుక్,సూపర్ బ్యాటరీతో..బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్

ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ రోబోట్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు.. వీడియో వైరల్

బ్రాండెడ్ స్మార్ట్‌ వాచ్ లవర్స్ కోసం.. Fastrack JupiterS3, రూ.1439కే సూపర్ ఫీచర్లు!

Big Stories

Advertisement
×