E-Paper
Advertisement

ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్

ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్.. మొత్తం 11,403 ఖాళీలు.. ఈ రోజే లాస్ట్ డేట్
Advertisement

IBPS Clerk Jobs| ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) క్లర్క్ 2026 దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. అభ్యర్థులు ఆగస్టు 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 11,403 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. చివరి సమయంలో టెక్నికల్ సమస్యలు రాకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు పూర్తి చేయాలి.

ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2026 దరఖాస్తు లాస్ట్ డేట్

ఐబిపిఎస్ క్లర్క్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 21 వరకు తమ దరఖాస్తు వివరాలను సవరించుకోవచ్చు. అదే రోజు ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుకు కూడా చివరి అవకాశం ఉంటుంది. సమర్పించిన దరఖాస్తు ఫామ్‌ను సెప్టెంబర్ 5 వరకు ప్రింట్ చేసుకోవచ్చు. ఫామ్‌ను సమర్పించే ముందు అభ్యర్థులు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
తప్పు సమాచారం నమోదు చేస్తే తదుపరి నియామక ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పరీక్ష తేదీలు

Advertisement

ఐబిపిఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డును సెప్టెంబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరుకావచ్చు. ఐబిపిఎస్ క్లర్క్ 2026 మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 27న నిర్వహించనున్నారు. పరీక్షలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అభ్యర్థులు అధికారిక ఐబిపిఎస్ వెబ్‌సైట్‌లో పరిశీలించాలి. రిజిస్ట్రేషన్ నంబర్, ఇతర దరఖాస్తు వివరాలను భద్రంగా ఉంచుకోవాలి.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. జీఎస్‌టీ, ఇతర సమాచార ఛార్జీలు కూడా ఫీజులో ఉంటాయి. జనరల్, OBC, EWS అభ్యర్థులు రూ.850 ఫీజు చెల్లించాలి. SC, ST, PwBD, మాజీ సైనిక అభ్యర్థులు రూ.175 చెల్లించాలి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

Advertisement

అభ్యర్థులు దరఖాస్తు ప్రారంభించే ముందు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఫామ్‌లో ఫొటో, సంతకం, బొటనవేలు ముద్రను అప్‌లోడ్ చేయాలి. అలాగే చేతిరాత డిక్లరేషన్‌ను కూడా నిర్దేశిత విధానంలో అప్‌లోడ్ చేయాలి. అన్ని పత్రాలు అధికారిక నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా అధికారిక IBPS రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ చూడంది. అందులో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నియామకానికి సంబంధించిన అప్లికేషన్ లింక్‌ను ఎంచుకోవాలి. వ్యక్తిగత, విద్యార్హత వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అవసరమైన ఫొటో, సంతకం, బొటనవేలు ముద్రను అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అన్ని వివరాలను మరోసారి పరిశీలించి ఫామ్‌ను ఫైనల్ సబ్మిట్ చేయండి. చివరగా కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసి భద్రంగా ఉంచుకోవాలి.

Also Read: మీ పిల్లాడు టీవీకి మరీ దగ్గరగా కూర్చుంటున్నాడా? బాల్యంలో కంటిచూపు సమస్యలు సూచించే సంకేతాలివే

చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయండి

అభ్యర్థులు చివరి రోజు వరకు వేచి ఉండకుండా దరఖాస్తు పూర్తి చేయడం మంచిది. చివరి సమయంలో వెబ్‌సైట్‌లో అధిక ట్రాఫిక్ కారణంగా సమస్యలు రావచ్చు. ఆగస్టు 21లోపు రిజిస్ట్రేషన్, పత్రాల అప్‌లోడ్, ఫీజు చెల్లింపు పూర్తి చేయాలి. గడువు తర్వాత సమర్పించే దరఖాస్తులు స్వీకరించబడువు.

Also Read: నల్లధనం ఉందా మా దగ్గరకు రండి.. బంగారం, కళాఖండాలు దాచుకోవడానికి బంకర్లు.. ప్రైవేట్ కంపెనీ ఆఫర్

Tags

Related News

సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదం.. రంగంలోకి సుప్రీంకోర్టు.. ఎన్నికల సంఘానికి నోటీసులు

‘రే*ప్ చేస్తే చస్తామనే భయం పుట్టించాలి’.. మహిళల భద్రతపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

బాల్యంలో లైంగిక దాడి.. 20 ఏళ్ల వయసులో తాతపై యువతి ప్రతీకారం.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి హత్య!

ఓట్ల చోరీ.. జేబీ చోరీ.. కేంద్రంపై CPI నారాయణ సంచలన వ్యాఖ్యలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జి పైనుంచి దూసుకెళ్లిన కారు, విద్యుత్ తీగల మధ్యలో

లోపల ప్రియురాలు.. కారు బానెట్‌పై ఇల్లాలు, యూపీలో విచిత్ర ఘటన

ఇండియన్ ఆర్మీలో జాబ్స్.. బిఈ, బిటెక్ ఫ్రెషర్స్‌కు అద్భుత అవకాశం

SIR వివాదం, CEC జ్ఞానేశ్వర్ రాజీనామా డిమాండ్.. మోడీ సర్కార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Big Stories

Advertisement
×