E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను మోసం చేసేందుకు ప్లాన్.. రోహిణికి మైండ్ బ్లాక్.. బాలుకు దొరికిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను మోసం చేసేందుకు ప్లాన్.. రోహిణికి మైండ్ బ్లాక్.. బాలుకు దొరికిపోతుందా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode August 21st: రాత్రి పడుకునే సమయంలో మీనా బాలు కోసమని పాలు తీసుకుని వస్తుంది. రోహిణి మనోజ్ లు ఎందుకు దూరంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు అని మీనా అంటుంది. ఇక మధ్యలో మా అమ్మ ఉండగా వాళ్ళిద్దరూ కలవర్లే అని బాలు అంటాడు.. అంతే కాదు.. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని కలిపితే బాగుంటుంది అని మీనా అంటుంది. ఆ విషయం ఒకసారి మనం మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దామని బాలు. ఇక అప్పుడే తన చిన్ననాటి ఫ్రెండ్ ని గుర్తు చేసుకుంటాడు. బాలు అప్పుడే అతను ఫోన్ చేయడంతో వీళ్ళిద్దరి స్నేహం చాలా గొప్పది అని మీనా అనుకుంటుంది.. అతని ఎక్కడున్నావ్ రా ఏం చేస్తున్నావ్ రా అంటే మొన్ననే జైలు నుంచి రిలీజ్ చేయొచ్చానురా అని అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక తర్వాత బాలు మీనా ఇద్దరు కలిసి పాలు పంచుకోవడం ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది..

మనోజ్ కోసం రోహిణి ప్లాన్…

మనోజ్ షాప్ లో కూర్చుని ఈగలు తోలుకుంటూ ఉంటాడు. రోహిణి ఉన్నన్ని రోజులు షాపు కళకళలాడేది కానీ ఇప్పుడు రోహిణి లేకపోవడంతో షాపులో ఈగలు తోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మనోజ్ ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడు ఎలాగైనా సరే సేల్స్ పెంచాలి అనుకుంటాడు. అయితే అప్పుడే ఒక రిచ్ కారు షాప్ దగ్గర ఆగుతుంది. ఇంత పెద్ద రిచ్ కారు నా షాప్ ముందర ఆగింది. ఎవరైనా ఫర్నిచర్ కొనడానికి వస్తున్నారేమో అని అనుకుంటాడు మనోజ్.. అయితే షాప్ లో నుంచి వచ్చిన వ్యక్తి మనోజ్ దగ్గరికి వచ్చి నాకు ఫర్నిచర్ కావాలి అని అడగ్గాని చాలా మంచి ఆర్డర్ వచ్చిందని మనోజ్ చాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఎంత ఆర్డర్ కావాలి అని అడుగుతారు కానీ రోహిణి మనస్సు ఉంటేనే నేను కొంటాను ఆవిడ నన్ను ఇక్కడికి పిలిచారు అని చెప్పగానే మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. సరే అండి నేను రోహిణి తీసుకుని వస్తాను అని చెప్తారు..

రోహిణి మాస్టర్ ప్లాన్..

Advertisement

రోహిణి ఒక వ్యక్తిని పంపించాను ఇంకా రాలేదేంటి అసలు దొరికిపోయాడా నిజమే అని మనోజ్ నమ్మాడా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది.. రోహిణి పంపించిన వ్యక్తి ఇంకా ఫోన్ చేయలేదు అని భయపడి పోయిన రోహిణి తనకి ఫోన్ చేయాలని అనుకుంటుంది.. ఆ ఫోన్ చేయగానే మీరు చెప్పిన దానికంటే ఎక్కువగానే చెప్పాను మనోజ్ పూర్తిగా నమ్మేసాడు అని రోహిత్ అంటాడు ఆ వ్యక్తి.. మీరు ఇచ్చిన చెక్కు అతనికి ఇస్తాను అది ఫ్రాడ్ అని తెలిసి నన్ను మళ్లీ జైల్లో వేస్తారా అని అడుగుతాడు. నేను చెప్పినట్లే చేయండి మీకు ఏ సమస్య రాకుండా చూసుకుంటాను అని రోహిణి భరోసా ఇస్తుంది..

ప్రభావతి చేసిన రచ్చ..

ఇక అందరూ భోజనం చేయడానికి అని కూర్చుంటారు.. రోహిణి వచ్చి కూర్చోడానికి చూస్తే ప్రభావతి సీరియస్గా ఒక చూపు చూడగానే రోహిణి భయపడిపోతుంది.. కూర్చోమని ఎవరు ఎంత చెప్పినా సరే ప్రభావతి చూపులకి భయపడిన రోహిణి కూర్చోడానికి సాహసం చేయదు. అయితే బాలు పాలర్లమ్మ కూర్చుంటే అమ్మ చంపేస్తుంది కదా అని అంటాడు.. ఇక ప్రభావతి మీనా పై రెచ్చిపోయి మాట్లాడడంతో శృతి మీనాకు సపోర్టుగా నిలిచి కౌంటర్లు వేస్తుంది.. మొత్తానికి ప్రభావతి శృతి మీనాల చేతిలో అడ్డంగా బుక్ అవుతుంది.. మీనా నీకేమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని శృతి అంటుంది. ఆ మాట వినగానే ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ మీతో ఒక్క విషయం మాట్లాడాలి అమ్మ పక్కకు రా అనేసి అంటాడు..

మనోజ్ మాటతో షాక్..

Advertisement

అమ్మ షో రూమ్ కి ఒక పెద్ద ఆఫర్ వచ్చిందమ్మా అతని రోహిణి ఉంటేనే కొనుక్కుంటాను అని అంటున్నాడు రోజు నేను తీసుకెళ్లనమ్మా అని మనోజ్ అడుగుతాడు. దాన్ని తీసుకుని వెళ్తే మొత్తం మింగేస్తుంది రా అని రోహిణి కి వెళ్లడానికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంది. ప్రభావతి. కానీ ఇదొక్కటే ఆర్డర్ కదమ్మా ఒకసారి తీసుకొని వెళ్లి ఆ అయిపోయిన తర్వాత మళ్లీ షాప్ కి రానివ్వకుండా చేయొచ్చు అని అంటాడు. అప్పుడే రోహిణి ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మతో అన్ని చెప్తున్నాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఒక పెద్ద ఆర్డర్ వచ్చిందని ప్రభావతి నిజం చెప్తుంది కానీ నాకు ఏదో తేడాగా ఉందని బాలు అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : శైలు మాటతో దిమ్మతిరిగే.. కేశవకు దైర్యం చెప్పిన మాధవ్.. నారాయణ కిడ్నాప్..

 

Related News

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Big Stories

Advertisement
×