BigTV English

Heart Attack: హార్ట్‌ఎటాక్.. కెనడాలో తెలుగు విద్యార్థిని మృతి

Heart Attack: హార్ట్‌ఎటాక్.. కెనడాలో తెలుగు విద్యార్థిని మృతి

Heart Attack: గుండెపోటుతో యువకుల హఠాన్మరణం జనాలను బెంబేలెత్తిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. ఇటీవల ఓ మూదో తరగతి విద్యార్ధిని, ఇంటర్ స్టూడెంట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. కోటి ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది.


నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామ ఉపసర్పంచికి అరుణ్ రెడ్డి, భరత్ రెడ్డి అనే ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె పూజితారెడ్డి ఉన్నారు. ఇప్పటికే పెద్ద కొడుకు అరుణ్ రెడ్డి కెనడాలో స్థిరపడగా.. కుమారుడు పూజితారెడ్డి కూడా వైద్య విద్యను అభ్యసించేందుకు జనవరి 26న కెనడా వెళ్లింది. స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటుంది.

అయితే పది రోజుల క్రితం పూజితా రెడ్డి ఉన్నంట్టుండి కిందపడిపోవడంతో తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పూజితారెడ్డి చనిపోయిన వైద్యులు నిర్దారించారు. సోదరుడు అరుణ్‌రెడ్డి పూజితారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×