E-Paper
Advertisement

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో ధ్వంసం..విశ్వవిద్యాలయానికి నిప్పు, హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్
Advertisement

Punjab: తప్పుడు వార్త నిర్ధారించుకోకుండా రాత్రికి రాత్రి యూనివర్సిటీలో నిరసనలు మిన్నంటాయి. రెచ్చిపోయిన స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఏకంగా వర్సిటీలోని భవనాలకు నిప్పుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగం ప్రవేశం చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఆ తప్పుడు వార్త ఏంటి?

ఓ ఫేక్ వార్త.. ఎల్‌పియులో భారీగా ధ్వంసం

పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ-LPU క్యాంపస్‌ రణరంగంగా మారింది. ఓ విద్యార్థిని బయటి వ్యక్తి అత్యాచారం చేశాడన్న వార్త సోషల్ మీడియాలో వ్యాపించింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున హింస చెలరేగింది. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేశారు. భవనాలకు నిప్పుపెడుతూ జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిని పూర్తిగా దిగ్బంధించారు. చిత్కారా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల నిరసనలు జరిగిన ఒక రోజు తర్వాత ఎల్‌పియులో ఈ సంఘటన చోటుచేసుకుంది. తమకు ఎలాంటి అత్యాచారానికి ఫిర్యాదులు అందలేదని, ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెబుతున్నారు.

విశ్వవిద్యాలయానికి నిప్పుపెట్టిన విద్యార్థులు

Advertisement

ప్రత్యక్ష సాక్షులు-పోలీసుల వివరాల మేరకు.. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బాలికల హాస్టల్ సమీపంలో ప్రారంభమైన ఈ విధ్వంసం, ఆ తర్వాత క్యాంపస్ అంతా దావానంలా వ్యాపించింది. ఆగ్రహించిన విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆస్తికి తీవ్ర నష్టం కలిగించారు. కిటికీలను పగలగొట్టడం, ఇటుకలు విసరడం, క్యాంపస్‌లోని కొన్ని భవనాలకు, ఆస్తులకు నిప్పు పెట్టడం వంటివి చేశారు. విద్యార్థుల దూకుడు ముందు విశ్వవిద్యాలయ ప్రైవేట్ భద్రతా సిబ్బంది పూర్తిగా నిస్సహాయులుగా మారిపోయారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో నిరసన చేస్తున్న విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని అక్కడున్న సైన్ బోర్డులను పగలగొట్టారు. విద్యార్థులు బయటకు వచ్చి సమీపంలోని జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు.

హైవేను దిగ్బంధించిన స్టూడెంట్స్, రంగంలోకి పోలీసులు

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే కపుర్తలా ఎస్ఎస్పి గౌరవ్ తూరా పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక తప్పుడు అత్యాచార వార్త వైరల్ కావడంతో యూనివర్సిటీ అంతా నిరసనలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఈ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పోలీసులకు అలాంటి ఫిర్యాదు ఏదీ అందలేదని వివరించారు. విద్యార్థులతో మాట్లాడి వారిని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నామని, పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తోందన్నారు. అలజడి సృష్టిస్తూ, పుకార్లు వ్యాపింపజేస్తున్న వారిని గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

ALSO READ: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

 

Related News

యూపీలో మారిన సీన్.. రాహుల్-అఖిలేష్ ఒక్కటయ్యారా? గెలుపు ఎవరిది?

షాకైన వాహనదారుడు, గిటార్‌పై AI రూ. 500 చలాన్! బెంగుళూరులో ఘటన

రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. వెంటనే అప్లై చేసేయండి

వీకెండ్‌లో ఫుల్ ఎంజాయ్, వోడ్కా తాగిన-ఆ తర్వాత, అసలు మేటరేంటంటే..

హైవే‌పై ఘోర ప్రమాదం..టైరు పగిలి ఏకంగా 100 మీటర్ల వరకు కారు, తప్పించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

వివాదంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్.. ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే.. ఎవరైనా షాక్ అవ్వాల్సిందే!

నాగాలాండ్‌లో విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

Big Stories

Advertisement
×