BigTV English

Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal: ఢిల్లీ తో పాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో నాలుగు స్థానాలకు జనవరి 19న రాజ్యసభ ఎన్నికలు ఎలక్షన్ కమీషన్ నిర్వహించనుంది. ముగ్గురు అభ్యర్థులను ఈ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నామినేట్‌ చేసింది. ఢీల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ అభ్యర్థిగా ప్రకటించిన పేర్లలో ఉన్నారు . స్వాతి మాలీవాల్ ను తమ అభ్యర్థిగా నామినేట్‌ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జనవరి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నెల 9వ తేదీలోగా నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.

Swati Maliwal :  ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ కు రాజ్యసభ ఛాన్స్ .. అభ్యర్థిగా ఎంపిక చేసిన ఆప్..

Swati Maliwal: రాజ్యసభ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ పేరు కూడా ఉంది. ఆమె రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ ప్రకటించింది. ఢిల్లీతోపాటు ఈశాన్య రాష్ట్రం సిక్కింలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జనవరి 19న ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9వ తేదీలోగా అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాలి.


ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు సుశీల్‌ కుమార్‌ గుప్తా, సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 27తో ఈ ముగ్గురి పదవీకాలం ముగియనుంది. సంజయ్‌ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తాకు మరోసారి రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించారు.

ఈ ఏడాది చివర్లో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుపే లక్ష్యంగా సుశీల్‌ కుమార్‌ గుప్తాకు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన స్థానంలో స్వాతి మాలివాల్‌ను ఆమ్‌ఆద్మీ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అయితే సంజయ్‌ సింగ్‌ మనీలాండరింగ్‌ కేసులో ఇటీవలే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. దీంతో తాను రెండోసారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పేపర్లు‌పై సంతకం చేసేందుకు తనను అనుమతించేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం అతనికి అనుమతి ఇచ్చింది.


Related News

TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Big Stories

×