OTT Movie : కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. క్లైమాక్స్ వరకు అసలు కథ అర్థం కాదు. కొంతమంది దర్శకులు ప్రేక్షకులపై ఇలా కూడా రివేంజ్ తీర్చుకుంటారనిపిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 30 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన పాప్ సింగర్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ఈ సింగర్ ఆడే మైండ్ గేమ్ మామూలుగా ఉండదు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? కథ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘ఓపస్’ (Opus) 2025లో A24 స్టూడియో నుంచి వచ్చిన అమెరికన్ థ్రిల్లర్ సినిమా. దీనికి మార్క్ యాంథనీ గ్రీన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయో ఎడెబిరి (ఆరియల్ ఎక్టన్), జాన్ మాల్కోవిచ్ (అల్ఫ్రెడ్ మోరెట్టి) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2025 మార్చి 14న థియేటర్లలో రిలీజై , జూలై 11 నుంచి HBO Maxలో స్ట్రీమ్ అవుతోంది. 1 గంట 45 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా, IMDb లో 5.7/10 రేటింగ్ పొందింది.
అరియల్ అనే యంగ్ రైటర్, ఒక ఫేమస్ పాప్ స్టార్ అయిన అల్ఫ్రెడ్ మోరెట్టి గురించి ఒక బుక్ రాయాలనుకుంటుంది. అల్ఫ్రెడ్ 30 ఏళ్ల క్రితం హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. అందరూ అతను చనిపోయాడని అనుకున్నారు. కానీ అరియల్‌కి అతని నుంచి ఒక సీక్రెట్ ఇన్విటేషన్ వస్తుంది. అతను ఒక నిర్మానుష్య ప్లేస్‌లో, తన ఫ్యాన్స్‌తో కలిసి దాక్కుని జీవిస్తుంటాడు. ఆ తరువాత అరియల్ ఇంకా కొంతమంది జర్నలిస్ట్స్ అతని కాంపౌండ్‌కి వెళ్తారు. అక్కడ అల్ఫ్రెడ్ సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తాడు. కానీ కొంచెం స్ట్రేంజ్‌గా ఉంటాడు. అతని ఫ్యాన్స్ అతన్ని దేవుడిలా ఆరాధిస్తారు. ఇది ఒక కల్ట్ లా ఉంటుంది.
అల్ఫ్రెడ్ తన కొత్త మ్యూజిక్ ఆల్బమ్ ‘ఓపస్’ గురించి చర్చిస్తాడు. ఇది అతని ఫైనల్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. దీనికోసం జర్నలిస్ట్స్‌ని, ఫ్యాన్స్‌ని ఉపయోగించాలని అతని ప్లాన్. కానీ ఈ ప్లాన్ లో అతడు అందరినీ మెంటల్ గా కంట్రోల్ చేస్తుంటాడు. ఇందుకోసం డ్రగ్స్, స్ట్రేంజ్ రిచ్యువల్స్ చేస్తాడు. అరియల్ మొదట అల్ఫ్రెడ్‌ని, అతని మ్యూజిక్‌ని ఇష్టపడుతుంది. కానీ తర్వాత అతని నిజమైన ప్లాన్ బయటపడుతుంది. అల్ఫ్రెడ్ సెలబ్రిటీలను జనం ఎలా ఆరాధిస్తారో, మీడియాని ఎలా మానిప్యులేట్ చేస్తారో చూపించడానికి ఈ ఆల్బమ్‌ని ఉపయోగిస్తాడు. జర్నలిస్ట్స్ కూడా అతని కంట్రోల్‌లోకి వెళ్తారు. కొందరు అతనికి ఫ్యాన్స్‌లా మారిపోతారు. అరియల్ ఈ కల్ట్‌లో చిక్కుకుంటుంది. ఆమె తెలివిగా అక్కడి నుంచి బయటపడాలని ట్రై చేస్తుంది.
క్లైమాక్స్ లో అల్ఫ్రెడ్ ప్లాన్‌ని అరియల్ బయటపెడుతుంది. అతని “ఓపస్” అనేది కేవలం మ్యూజిక్ ఆల్బమ్ కాదు. ఇది ఒక డేంజరస్ గేమ్. జనాలను మానిప్యులేట్ చేసి, వాళ్ల లైఫ్‌లను నాశనం చేసే ప్లాన్. అరియల్ ఈ పరిస్థితిని ఎలా హాండిల్ చేస్తుంది ? అక్కడి నుంచి ఎలా బయట పడుతుంది ? అనే విషయాలను ఈ అమెరికన్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : గడ్డివాములో గందరగోళం… పిల్లాడికి హెల్ప్ చెయ్యడానికి వెళ్లి ట్రాప్… గూస్ బంప్స్ పక్కా