OTT Movie : హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ సినిమాలకు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలను చూస్తున్నప్పుడు వచ్చే కిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కొన్ని సినిమాలు మరింత ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక డెత్ గేమ్ లా నడుస్తుంది. ఇందులో ఒక మహిళను కిడ్నాప్ చేసి, భయంకరమైన ఉచ్చులో పడేస్తారు. అక్కడి నుంచి ఆమె బయటపడటానికి, ప్రాణాలకు తెగించి పోరాడాల్సి వస్తుంది. ఈ కథ క్లైమాక్స్ వరకు టెన్షన్తో చెమటలు పట్టిస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Meander’ మాథియూ తురి దర్శకత్వం వహించిన, ఫ్రెంచ్ హారర్ థ్రిల్లర్ సినిమా. ఇది 2021 జూలైలో అమెరికాలో విడుదలైంది. ఇందులో వెయిస్, పీటర్ ఫ్రాన్జెన్, రొమానే లిబర్ట్, ఫ్రెడెరిక్ ఫ్రాన్చిట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. 96 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ సినిమా IMDbలో 5.4/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా ట్యూబీ, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
లిసా అనే మహిళ ఫ్రాన్స్‌లోని ఒక చిన్న టౌన్‌లో ఉంటుంది. ఆమె తన కూతురు మరణం వల్ల మానసికంగా కుంగిపోయి, డిప్రెస్డ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఆమె జీవితం అర్థం లేనట్టు సాగుతోంది. ఒక రోజు రాత్రి, లిసా రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ ఉంటుంది. దాదాపు ఆత్మహత్య ఆలోచనల్లో మునిగి ఉంటుంది. అడామ్ అనే ఒక స్ట్రేంజర్ కార్‌లో వచ్చి ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. అడామ్ సాధారణంగా కనిపిస్తాడు, కానీ అతని బిహేవియర్‌లో ఏదో సస్పెన్స్ ఉంటుంది. లిసా అతనితో కార్‌లో ఎక్కుతుంది. కానీ ఇంతలోనే అడామ్ ఆమెకు డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాడు. లిసా కళ్ళు తెరిచేసరికి, ఆమె ఒక ఇరుకైన మెటల్ ట్యూబ్‌లో చిక్కుకుని ఉంటుంది. ఆమె ఒక సై-ఫై సూట్ ధరించి ఉంటుంది, రిస్ట్‌లో ఒక డిజిటల్ టైమర్ ఉంటుంది. అది ఇప్పుడు సమయాన్ని కౌంట్‌డౌన్ చేస్తుంది. 11 నిమిషాలకు ఒక సారి పెద్ద ప్రమాదం వస్తుంది. తప్పించుకొకపోతే ప్రాణాలు పోతాయి.
ఆమె ఉన్న టన్నెల్ వంకర టింకరగా ఉంటుంది. ఇందులో చాలా భయంకరమైన డెడ్‌లీ ట్రాప్స్ ఉంటాయి. లిసాకి ఇప్పుడు బతకడానికి ఒక్కటే అవకాశం ఉంది. ఆమె టైమర్ జీరో అయ్యేలోపు ఒక్కో సెక్షన్‌ని క్రాస్ చేయాలి. లేకపోతే ఆమె చనిపోతుంది. ఈ ట్రాప్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో లిసా ఫిజికల్‌గా, మెంటల్‌గా బ్రేక్‌డౌన్ అవుతుంది. ఆమె శరీరం గాయాలతో నిండిపోతుంది, కానీ ఆమె చనిపోయిన కూతురు జ్ఞాపకాలు ఆమెకు బతకడానికి ధైర్యం ఇస్తాయి. కథ నడుస్తున్న కొద్దీ ఆమె ధైర్యంతో అడుగులు వేసి, మేజ్‌లో ఒక ఫైనల్ సెక్షన్‌కి చేరుకుంటుంది. చివరికి లిసా మేజ్ నుంచి బయటపడుతుందా ? ఆ ఉచ్చులో బలైపోతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : కూతురి ఫోన్లో అలాంటి వీడియోలు… తండ్రి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్ భయ్యా