Palnadu Crocodiles : పల్నాడు జిల్లా నకరికల్లు ప్రాంతంలో మొసళ్ల సంచారం కలకలం రేపింది. ఒకే రోజు రెండు చోట్ల మొసళ్లు కనిపించాయి. దేచవరంలో ఓ బావి వద్ద, త్రిపురాపురం సమీపంలో కాలువ కట్టపై మొసళ్లను స్థానికులు గమనించారు. పెద్ద మొసళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.