BigTV English

French Fries Domestic Violence: ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !

French Fries Domestic Violence: ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం గృహ హింస కేసు పెట్టిన భార్య.. భలే తీర్పు చెప్పిన కోర్టు !

French Fries Domestic Violence| భార్య భర్తల మధ్య గొడవలు జరగడం సాధారణమైన విషయం. కానీ కొన్ని సార్లు ఈ గొడవలు తీవ్రమైనప్పుడు విషయం పోలీస్ స్టేషన్ వరకు, కోర్టు వరకు వెళుతుంది. కోర్టు లో కేసు వరకు వెళ్లిందంటే విషయం సీరియస్ అని అందరూ భావిస్తారు. కానీ ఇటీవల ఒక విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒక సాధారణమైన విషయం.. వినడానికి హాస్యాపద కారణం వల్ల ఒక యువతి తన భర్తపై కేసు వేసింది. తనపై గృహ హింస జరుగుతోందంటూ హైకోర్టు తలుపులు తట్టింది.


వివరాల్లోకి వెళితే.. బెంగుళూరులో నివసించే ఒక యువతి తన భర్తపై గృహహింస కేసు విని కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి, లాయర్లు సైతం విస్తుపోయారు. బెంగుళూరుకు చెందిన కౌసల్య అనే యువతి తన భర్త తనకు ఇష్టమైన ఆహారం తినకుండా అడ్డుపడుతున్నాడని హైకోర్టు న్యాయమూర్తికి విన్నవించుకుంది. ముఖ్యంగా తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టమని.. అవి తినకుండా తన భర్త అడ్డుకుంటున్నాడని.. అతడిని శిక్షించాలని కోర్టును కోరింది.

Also Read: భర్త నుంచి ప్రతినెలా రూ.6 లక్షలు భరణం డిమాండ్ చేసిన మహిళ.. మండిపడిన కోర్టు!


హైకోర్టులో కౌసల్య వాదిస్తూ.. తాను గర్భవతిగా ఉన్న సమయంలో పౌష్టికాహారం మాత్రమే తినాలని.. ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదని ముందు సూచనలు మాత్రమే చెప్పేవాడని.. కానీ ఇప్పుడు అసలు ఫ్రెంచ్ ఫ్రైస్ తినకుండా బలవంతంగా అడ్డుపడుతున్నాడని చెప్పింది. తాను బంగ్లాదేశ్ పొటేటోలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టంగా తింటానని.. కనీసం వాటిని ఇంట్లో వంట చేసుకొని తినాలన్నా.. అడ్డుపడుతన్నాడని.. ఇది చాలా క్రూరమైన విషయంగా పరిగణిస్తూ.. గృహహింస చట్టం కింద తన భర్తను కఠినంగా శిక్షించాలని కోరింది.

అయితే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముందుగా.. ఆమె భర్త వివరణ కోరింది. కౌసల్య భర్త తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం అని తన భార్య వేసిన కేసును కొట్టివేయాలని కోరాడు. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న మాట్లాడుతూ.. ఇలాంటి విషయాల్లో భర్తపై కేసు పెట్టడం సరికాదని.. ఒక వేళ భార్య ఆరోగ్యం బాగుండాలని కోరుకునే ఒక భర్త తన భార్యను ఏమైనా తినకుండా ఆపితే అందులో తప్పేమి లేదని.. అలా చేయడం అతని హక్కు అని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో గృహ హిస కేసు వర్తించదని చెప్పారు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

అయితే ఇంత చిన్న విషయాన్ని కోర్టు వరకు తీసుకువచ్చినందుకు కౌసల్యపై న్యాయమూర్తి మండిపడ్డారు. ఆమె గర్భవతి కాబట్టి కేవలం హెచ్చరించి వదిలేస్తున్నట్లు అన్నారు. లేకపోతే కోర్టు విలువైన సమయం వృథా చేసినందకు మూడు నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుందని చెబుతూ.. ఈ కోర్టును కొట్టివేశారు.

Also Read: రాఖీ పండుగ రోజు ‘ఆల్ మెన్ ఆర్ రేపిస్ట్’ ట్వీట్ చేసిన యువతి.. ఆమె సోదరుడు ఏం చేశాడంటే?..

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×