BigTV English
Advertisement

Actor Ritabhari Chakraborty: బెంగాల్‌ సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్..బయటపెట్టిన నటి!

Actor Ritabhari Chakraborty: బెంగాల్‌ సినీ ఇండస్ట్రీలోనూ కాస్టింగ్ కౌచ్..బయటపెట్టిన నటి!

Actor Ritabhari Pushes For Hema Committee style probe in bengal industry: మలయాళ సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ సంచలం రేపుతోంది. ఇప్పటికే పలువురు నటీమణులు సినిమా అవకాశాలతో కొంతమంది అగ్రనటులు గురిచేసిన ఇబ్బందులు, ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి బహిరంగంగా వెల్లడించారు. అయితే తాజాగా, పశ్చిమ బెంగాల్ సినీ పరిశ్రమకు చెందిన ఓ నటి సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


బెంగాల్ సినీ పరిశ్రమలోనూ లైంగిక వేధింపులపై దర్యాప్తు చేపట్టాలని సీఎం మమతా బెనర్జీని బెంగాల్ నటి రితాభరీ చక్రవర్తి కోరారు. ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక్కడ కూడా జస్టిస్ హేమా కమిటీ వంటి దానికి ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అభ్యర్థించారు. బెంగాల్ పరిశ్రమలోనే ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. తనతోపాటు తనతోటి వారికి కొంతమంది నటులు, దర్శక నిర్మాతల చేతిలో భయంకర అనుభవాలు ఎదురయ్యాయయని చెప్పుకొచ్చారు. అయితే, ఆమె ఎవరి పేరు ప్రస్తావించలేదు.

కొంతమంది వ్యక్తులు వేధింపులకు గురి చేశారని, మళ్లీ అదే వ్యక్తులు బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసన కార్యక్రమాల్లో ఎలాంటి సిగ్గు లేకుండా పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసిందని రాసుకొచ్చారు. నాకు తెలిసిన కీచక నటులు, నిర్మాతలు, దర్శకులు ఆర్జీ కర్ బాధితురాలి కోసం కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి మానవ మృగాలు ముసుగులు వేసుకొని సమాజంలో తిరుగుతున్నారని, ఇలాంటి వ్యక్తుల భరతం పట్టాలన్నారు.


నా తోటి నటులను నేను ఒక్కటే కోరుతున్నానని, ఇలాంటి రాక్షసేలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. వీరి గురించి మాట్లాడితే ఎక్కడా అవకాశాలు రావనే భయం అందిరిలోనూ ఉందన్నారు. కొంతమంది సినీ పరిశ్రమను ప్రభావితం చేసే వాళ్లు కూడా ఉన్నారని, అయినా భయపడకుండా ఎదుర్కోవాలని కోరారు.

ఇదిలా ఉండగా.. నటి నటి రితాభరీ చక్రవర్తి ‘భోతుష్ కోన్(2014), ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ కోల్‌కతా(2014), ‘బవాల్’(2015), ఫటాఫతి(2022) వంటి హిట్ సినిమాల్లో నటించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×