BigTV English

Adani: అదానీ ‘ఆడిట్’ ఐడియా!.. వర్కవుట్ అయ్యేనా?

Adani: అదానీ ‘ఆడిట్’ ఐడియా!.. వర్కవుట్ అయ్యేనా?

Adani: అదానీ కొంప కొల్లేరైంది. కంపెనీ షేర్లు పేక మేడలా కుప్పకూలిపోయాయి. మార్కెట్లలో బ్లడ్ బాత్ నడిచింది. సుమారు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. మదుపర్లు ఆగమాగమయ్యారు. హిండెన్ బర్గ్ రిసెర్చ్ రిపోర్ట్.. అదానీని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇంతకీ, హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలన్నీ నిజమేనా? అంటే కంపెనీ మాత్రం కాదంటోంది. కేంద్రం మౌనం వహిస్తోంది. ప్రధాని మోదీ నోరు మెదపడం లేదు. కమిటీ వేస్తామని మాత్రం తాజాగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇలా కొంతకాలంగా దేశ రాజకీయమంతా అదానీ చుట్టూ తిరుగుతుండగా.. నష్ట నివారణ చర్యలకు రెడీ అయింది కంపెనీ. గ్రూప్ కంపెనీల్లో స్వతంత్ర ఆడిట్‌ కోసం గ్రాంట్ థోర్టన్‌ (Grant Thornton) అనే అకౌంటెన్సీ సంస్థను నియమించుకుంది అదానీ. తద్వారా పెట్టుబడిదారులు, నియంత్రణా సంస్థలకు భరోసా ఇవ్వాలని భావిస్తోంది.


నిధుల దుర్వినియోగం, స్వదేశీ నిధుల దారి మళ్లింపు, రుణాలను ఇతర అవసరాలకు వినియోగించడం వంటి ఆరోపణలపై ఆడిట్ జరగనుంది. కంపెనీ ఖాతాలు బలంగా ఉన్నాయని, ప్రాజెక్టుల అమలు నిరాటంకంగా కొనసాగుతుందని ఆడిట్‌ ద్వారా నిరూపించుకోవాలని చూస్తోంది. అదానీ గ్రూప్ ఏ విషయాన్ని దాచిపెట్టలేదని.. RBI, SEBI తదితర నియంత్రణ సంస్థలకు చూపించడమే ఆడిట్‌ ప్రాథమిక లక్ష్యమని కంపెనీ వర్గాలు తెలిపాయి.

కంపెనీ టార్గెట్స్, మూలధన వ్యయాల్లో కోత విధించ వచ్చన్న వార్తలను అదానీ గ్రూప్‌ ఖండించింది. ప్రాజెక్టులు ఆలస్యం కావొచ్చు కానీ.. వాయిదా పడడం కానీ, విరమించుకోవడం కానీ జరగదని స్పష్టం చేసింది. సౌర విద్యుత్తు, హరిత హైడ్రోజన్‌, విమానాశ్రయాల విస్తరణ ప్రణాళికలు అనుకున్న సమయానికే పూర్తి అవుతాయని ప్రకటించింది. తాజా ఆడిట్ తో మార్కెట్ వర్గాల్లో మరింత భరోసా కల్పించడమే అదానీ ధ్యేయంగా కనిపిస్తోంది.


Related News

Gautami Chowdary: గౌతమ్‌ చౌదరికి అంబర్‌పెట్‌ శంకర్‌ మద్దతు.. లైవ్‌లో అసలు నిజం బట్టబయలు..

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

Big Stories

×