BigTV English

Karnataka News: ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ ఆకాంక్ష మృతి.. పంజాబ్‌లో ఏం జరిగింది?

Karnataka News: ఏరోస్పేస్‌ ఇంజినీర్‌ ఆకాంక్ష మృతి.. పంజాబ్‌లో ఏం జరిగింది?

Karnataka News: ఏరో స్పేస్ ఇంజనీరు, జెట్ ఎయిర్‌వేస్ ఉద్యోగి ఆకాంక్ష మృతి వెనుక ఏం జరిగింది? సర్టిఫికెట్ల కోసం పంజాబ్ వెళ్లింది. అక్కడి నుంచి అటు పైలోకానికి వెళ్లిపోయింది. కాలేజీలో ఏమైనా జరిగిందా? ఎందుకు కూతురు మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


ఆకాంక్ష గురించి

కర్ణాటకలోని దర్మస్థలంలోని బోళియార్ ప్రాంతానికి సురేంద్ర-సింధూ దేవి దంపతుల గారాలపట్టి ఆకాంక్ష. వయస్సు కేవలం 22 ఏళ్లు. ఇటీవల ఏరో స్పేస్ ఇంజనీరు కోర్సు చదువు పూర్తి చేసింది. ప్రస్తుతం జెట్ ఎయిర్‌వేస్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. కూతుర్ని చూసి ఆ తల్లిదండ్రులు ముచ్చట పడేవారు. ఇరుగుపొరుగు వారు తమకు ఇలాంటి కూతురు ఉంటే బాగుండేదని భావించేవారు.


ప్రస్తుతం విదేశాలకు వెళ్లాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పేసింది. వారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే క్రమంలో చదువుతున్న కాలేజీ నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు పంజాబ్ వెళ్లింది. ఫగ్వాడాలో ఎల్‌పీయూ విద్యా సంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసింది ఆకాంక్ష. సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు శుక్రవారం ఆ కాలేజీ వెళ్లింది ఆకాంక్ష.

శనివారం ఇంటికి రావాలని పేరెంట్స్ చెప్పారు. కాకపోతే అక్కడి పరిస్థితులు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు అప్ డేట్ చేస్తూ వచ్చింది. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆకాంక్ష కాలేజీ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. కానీ, ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు.

ALSO READ: పాక్ గూడచర్య.. నిన్న జ్యోతి, నేడు షాజాద్, రేపు ఇంకెవరు?

షాకైన పేరెంట్స్

శనివారం సాయంత్ర పంజాబ్ పోలీసులు ఫోన్ చేసి ఆకాంక్ష తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పారు. ఓ భవనం పైనుంచి పడి చనిపోయిందని ఆ వార్త సారాంశం. ఆ కబురు విని పేరెంట్స్, బంధువులు షాకయ్యారు. సమాచారంతో వెంటనే ఆరుగురు కుటుంబసభ్యులు పంజాబ్ వెళ్లారు. ఆదివారం రాత్రి జలంధర్ జిల్లా ఫగ్వారాలో ప్రభుత్వం ఆసుపత్రికి చేరుకున్నారు.

ఆకాంక్ష సోదరుడు జలంధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోమవారం ఆకాంక్ష మృతదేహానికి పోస్ట్‌మార్టం జరగనుంది. అక్కడి నుంచి కర్ణాటక ధర్మస్థలంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దీనిపై ఆకాంక్ష తండ్రి సురేంద్రన్ రాష్ట్రపతి, కర్ణాటక ముఖ్యమంత్రి ఓ లేఖ రాశారు.

తన కూతురు ఆకాంక్ష ‘అసహజ’ మరణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని అందులో ప్రస్తావించారు. తమ కూతురు మృతికి న్యాయం చేయాలని కోరారు. జీవితంలో ఎంతో సాధించాల్సిన ఆకాంక్ష జీవతం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఈ కేసుపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో కొత్త విషయాలు బయటకు వస్తాయా? లేదో చూడాలి.

Related News

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Big Stories

×