E-Paper
Advertisement

Aftab Narco Test : పూర్తికానున్న శ్రద్ధా వాకర్ మర్డర్ కేస్..

Aftab Narco Test : పూర్తికానున్న శ్రద్ధా వాకర్ మర్డర్ కేస్..
Advertisement

Aftab Narco Test : శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో పరీక్ష పూర్తయింది. హంతకుడు అఫ్తాబ్ చెబుతున్న విషయాలు నిజమైనవేనా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు ఈ టెస్ట్ చేస్తున్నారు. ఇటీవల అఫ్తాబ్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం సుమారు 8.40 గంటలకు అప్తాబ్‌ను ఢిల్లీలోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఉదయం 10 గంటలకు నార్కో టెస్ట్ మొదలు పెట్టారు. దాదాపు రెండున్నర గంటలపాటు నిర్వహించిన ఈ నార్కో టెస్ట్‌లో..పోలీసులు అప్తాబ్‌ను అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

పాలీగ్రాఫ్ టెస్ట్‌లో చెప్పినట్లే..నార్కో టెస్ట్‌లో కూడా..తానే శ్రద్ధాను హత్య చేసి 35 ముక్కలుగా నరికినట్లు పోలీసులకు వివరించాడు. శ్రద్ధా శరీర భాగాలను ఢిల్లీ మెహ్రౌలీ అడవిలో పడేసినట్లు అంగీకరించాడు. శ్రద్ధాను చంపినందుకు తనకేమీ పశ్చాత్తాపము లేదని విచారణలో అఫ్తాబ్ చెప్పినట్లు సమాచారం. పాలీగ్రాఫ్ టెస్ట్, నార్కో పరీక్షలు పూర్తికావడంతో.. శ్రద్ధా మర్డర్ కేసు కొలిక్కి వచ్చింది. త్వరలోనే నిందితుడికి కఠిన శిక్షను అమలు చేసేలా దర్యాప్తు కొనసాగుతోంది. రెండు రోజుల ముందు అఫ్తాబ్‌ను ఆసుపత్రి నుంచి జైలుకు తీసుకువెళ్తుంటే..మార్గమధ్యలో అప్తాబ్‌ను చంపడానికి 15 మంది కత్తులతో అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వ్యాన్ పై అటాక్ చేశారు. అఫ్తాబ్‌కు కఠిన శిక్ష విధించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×