BigTV English

Jaipur Crimes : 2 కోట్ల భీమా కోసం..భార్యను హత్యచేయించిన భర్త..

Jaipur Crimes : 2 కోట్ల భీమా కోసం..భార్యను హత్యచేయించిన భర్త..

Jaipur Crimes : 1 కోటి 90 లక్షల భీమా డబ్బు కోసం భర్తే దగ్గరుండి మరీ భార్యను కారుతో గుద్దించి హత్య చేయించాడు. యాక్సిడెంట్‌కా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. భార్య పేరు మీరు రూ.2కోట్ల రూపాయల భీమా డబ్బుతో జల్సా చేద్దామనుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో భర్త ప్లాన్ బెడిసికొట్టింది. పక్కా ప్లాన్ అని పోలీసులు నిర్ధారించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. మహేశ్ చంద్, షాలుకి 2015లో వివాహమైంది..వారికి ఒక కూతురు. రెండేళ్ల తరువాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. మహేశ్ చంద్ పై పోలీస్ స్టేషన్‌లో గ‌ృహ హింస కేసు కూడా నమోదైంది. అయినా అతను పద్ధతి మార్చుకోలేదు. భార్యను హతమార్చి డబ్బులు కాజేయాలని ప్లాన్ చేశాడు.


భార్య షాలును కలిసి..నేను మారానని మళ్లీ చేసిన తప్పులు చేయనని భార్యను బతిమిలాడాడు. ఆమె ఒప్పుకోవడంతో దగ్గరకు తీసింది. షాలు పై రూ.2కోట్ల రూపాయలకు భీమా చేయింది. షాలుది సాధారణ మరణమైతే రూ.1 కోటి..ప్రమాదమైతే రూ.1.90 లక్షలు వచ్చే విధంగా పాలసీ చేయించాడు. దేవుడికి ఓ మొక్క చెల్లించానని..అది పూర్తి కావాలంటే..షాలు 11 రోజుల పాటు హనుమాన్ ఆలయానికి వెళ్లి రోజూ పూజలు చేయాలన్నాడు. భర్త చెప్పినట్లే షాలు రోజూ హనుమాన్ గుడికి వెళ్లసాగింది. రౌడీషీటర్ ముఖేశ్ సింగ్ రాథోడ్‌కు షాలుని చంపమని రూ.10లక్షల సుపారీ ఇచ్చాడు. అక్టోబర్ 5న బంధువుతో కలిసి షాలు హనుమంతుడి గుడికి బైక్‌పై వెళ్తుంది. అప్పుడే రౌడీ షీటర్ మేఖేష్ కారుతో షాలు బైక్‌ను ఢీకొట్టిస్తాడు..ఆమె బంధువు తీవ్ర గాయాలపాలవగా..షాలు మృతి చెందింది. షాలును గుద్దిన కారు వెనకాలే భర్త మరో కారులో ఉన్నట్లు విచారణలో తేలింది. భీమా డబ్బుల కోసం హత్యలు, ఆత్మహత్యలు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×