BigTV English

Wayanad Landslides: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పోస్టుపై తీవ్ర దుమారం

Wayanad Landslides: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పోస్టుపై తీవ్ర దుమారం

Wayand Landslides: వరదల కారణంగా కేరళలోని వయనాడ్‌లో భారీ ఆస్థి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆకస్మిక వరదల కారణంగా అల్లకల్లోలమైన వయనాడ్‌లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ శనివారం పర్యటించారు. బాధితులను పరామర్శించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. తనవంతుగా కొంతమందికి సహాయక సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగానే తన పర్యటన అనంతరం వయనాడ్ పర్యటనను మరపు రానిదిగా పేర్కొంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.


ఇదిలా ఉంటే శశి థరూర్ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందలాది మంది మృతి మీకు మరపు రాని పర్యటనను మిగిల్చిందా అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై శశి థరూర్ వివరణ ఇచ్చారు. మమోరబుల్ అంటూ తాను ఉపయోగించిన పదానికి ఉన్న అర్థాన్ని వివరించారు. గుర్తుంచుకోగిన, గుర్తుండిపోయే సంఘటనను మమోరబుల్ గా వ్యవహరిస్తామని తెలిపారు. అంతే కాకుండా ఆయా ఘటనలకు ఉన్న ప్రత్యేకత లేదా అవి మరచిపోలేని జ్ఞాపకానలు మిగిల్చినప్పుడు ఆ పదాన్ని వాడతామని అన్నారు. పరోక్షంగా వయనాడ్ లో వరదలు బాధాకరమైన జ్ఞాపకాలను మిగిల్చియని ఆయన తెలిపారు.

శశిథరూర్ స్వయంగా తానే ఓ మినీ ట్రక్కులో సామాగ్రిని నింపారు. ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. అనంతరం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి కలిసి ఓదార్చారు. వీటన్నింటికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ మెమోరబుల్ అనే క్యాప్షన్ ను ఇచ్చారు. దీనిపై బీజేపీ నేతలతో పాటు పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శశిథరూర్‌కు మరణాలు, మారణ హోమం చిరస్మరణీయ జ్ఞాపకాలా అని ఎద్దేవా చేశారు.


 

Related News

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

Big Stories

×