Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు కూతవేటు దూరంలో ఎయిరిండియా విమానం కూలింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి బీజే మెడికల్ కాలేజీ విద్యార్థుల హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు MBBS విద్యార్థులు, PG రెసిడెంట్ డాక్టర్, మరో డాక్టర్ భార్య మరణించారు. ఈ విషయాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్-FAIMA ప్రకటించింది.
అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం 1:38 నిమిషాల సమయంలో ఎయిరిండియా విమానం లండన్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 30 సెకన్లలో బీజే మెడికల్ కాలేజీ హాస్టళ్ల భవనంపై కుప్పకూలింది. ప్రమాద సమయంలో హాస్టల్ క్యాంటీన్‌లో మెడికోలు భోజనం చేస్తున్నారు.
ఈ ఘటనలో ఐదుగురు MBBS విద్యార్థులు, PG రెసిడెంట్ డాక్టర్, BJ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ భార్య మరణించారు. మరో 60 మంది వైద్య విద్యార్థులు గాయపడ్డారు. ఇంకా గాలింపు కొనసాగుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది. గాయపడినవారిలో కొందరు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపింది. శిథిలాలలో చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని FAIMA జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ దివ్యాన్ష్ సింగ్ వెల్లడించారు. గుర్తించిన మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని అన్నారు.
ALSO READ: భర్త కోసం వెళ్తున్న నవ వధువు, అంతలో తిరిగిరాని లోకాలకు
మరోవైపు విమాన ప్రమాదంలో 81 మృతదేహాలు రికవరీ చేశాయి సహాయక బృందాలు. అయితే మృతుల సంఖ్య ఎంత అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు ఎన్డీఆర్ఎఫ్ ఇన్ స్పెక్టర్ వినయ్‌కుమార్. ఇందుకోసం ఏడు బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టీమ్ విచారణ మొదలుపెట్టింది.
విమానం ఘటనకు ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్, ఫ్లైట్ డేటా రికార్డర్- కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ కోసం అన్వేషణ సాగుతోంది. గురువారం రాత్రి వరకు రెస్క్యూ బృందాలు ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతుకుతున్నాయి. అనధికారిక నివేదికల ప్రకారం వైద్య హాస్టల్ సముదాయంలో 25 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు.
డిఎన్‌ఎ పరీక్ష తర్వాత బాధితుల గుర్తిస్తామని తెలిపారు. మరణించిన వారి సంఖ్య అధికారులు అధికారికంగా విడుదల చేస్తారని తెలిపారు. శిథిలాల కారణంగా ఆ ప్రాంతంలో ఊహించలేనంత విధంగా విధ్వంసం జరిగిందన్నారు. బహుళ అంతస్తుల భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు కాలిపోగా, పలు కార్లు ధ్వంసమయ్యాయి.
విమానం ముందు భాగం వైద్య విద్యార్థులు భోజనం చేస్తున్న డైనింగ్ హాల్ అంతస్తుపై పడింది. ఓవరాల్‌గా ఈ ఘటనలో కనీసం 265 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. విమాన ఘటన జరిగిన ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా MD & CEO కాంప్‌బెల్ విల్సన్ చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును అక్కడి సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు.
#WATCH | Air India MD & CEO Campbell Wilson arrives at AI-171 plane crash site in Ahmedabad
241 passengers lost their lives in the plane crash yesterday pic.twitter.com/Jw1GOnduUI
— ANI (@ANI) June 13, 2025