BigTV English

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్

Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్

Ahmedabad Plane Crash| అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 గురువారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 240 మందికి పైగా చనిపోయారు. విమానంలో ఉన్నవారిలో దాదాపు అందరూ చనిపోయారు. పైగా విమానం జనావాసంలోని ఒక బిల్డింగ్ పై పడడంతో ఆ భవనంలో కూడా అయిదుగురికి పైగా మరణించారు. కానీ ఈ విమాన ప్రమాదం నుంచి ఒక మహిళ తప్పించుకుంది. ఆమె పేరు భూమి చౌహాన్. ఆమె 10 నిమిషాల వ్యవధిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ట్రాఫిక్‌లో ఆలస్యం కావడంతో ఆమె విమానాశ్రయానికి లేటుగా చేరుకుంది. దీంతో ఎయిర్ ఇండియా విమానం అప్పటికే టేకాఫ్ అయిపోయిందని రిపబ్లిక్ టీవీ రిపోర్ట్ ద్వారా తెలిసింది.


విమానం కూలిపోవడంపై భూమి చౌహాన్ మాట్లాడుతూ.. “కేవలం 10 నిమిషాల వల్ల విమానాన్ని మిస్ అయ్యాను. లేకపోతే నేను కూడా ఆ విమానంలో వెళ్లి ప్రమాదానికి గురయ్యేదాన్ని. ఇప్పటికీ ఆ ఆలోచన తలుచుకుంటేనే నా శరీరం వణికిపోతుంది. ప్రమాదంలో అంతమంది చనిపోయారని తెలిసి నా మనసు చలించిపోయింది. చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు.” అని ఆమె తెలిపింది.

‘గణపతి బప్పా నన్ను కాపాడాడు’:
భూమి చౌహాన్ విమానాన్ని మిస్ అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 1:38 గంటలకు టేకాఫ్ అయి, కొన్ని నిమిషాల్లోనే విమానాశ్రాయం సమీపంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది. “విమానం కూలిపోయిందని తెలిసి నా మనసు చలించిపోయింది. దేవుడికి కృతజ్ఞతలు. నా గణపతి బప్పా నన్ను కాపాడాడు” అని భూమి చెప్పింది.


లండన్‌లో తన భర్తతో కలిసి భూమి చౌహాన్ నివసిస్తోంది. రెండేళ్ల తర్వాత సెలవుల కోసం భారత్‌కు వచ్చింది. ఆమె ఒక్కరే ఆ విమానంలో లండన్ తిరిగి వెళ్లాల్సి ఉంది. “ కేవలం పది నిమిషాల ఆలస్యం వల్లే నేను విమానం ఎక్కలేకపోయాను. ఆ తరువాత విమానం మిస్ అయినందుకు బాధపడ్డాను. కానీ జరిగిన ప్రమాదం గురించి తెలిసి షాకయ్యాను” అని ఆమె చెప్పింది.

ఈ ప్రమాదం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌కు సంబంధించిన అత్యంత ఘోరమైన ఘటనల్లో ఒకటి. ఈ 12 ఏళ్ల విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు చేరుకుంది. టేకాఫ్ తర్వాత కొద్ది సేపటికే విమానం 625 అడుగుల ఎత్తుకు చేరి, వేగంగా కిందకు వేగంగా జారుతూ.. నివాస ప్రాంతంలో కూలి పేలిపోయింది. విమానం కూలిన ప్రదేశంలో భారీగా మంటలు రేగాయని ఫ్లైట్‌రాడార్24 డేటా తెలిపింది.

Also Read: బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌ తయారీలో లోపాలు.. 2024లోనే హెచ్చరించిన ఇంజినీర్

భూమి చౌహాన్ ఈ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలు కోవడం నిజంగా ఒక అద్భుతం. ఈ ఘటనలో కొన్నిసార్లు ఆలస్యం కూడా ఒక రకంగా మేలు చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×