BigTV English

Ahmedabad Plane Crash: బరువు తక్కువ, ఇంధన వినియోగం ఎక్కువ.. ఇంతటి ఘోరానికి కారణం ఇదేనా.!

Ahmedabad Plane Crash: బరువు తక్కువ, ఇంధన వినియోగం ఎక్కువ.. ఇంతటి ఘోరానికి కారణం ఇదేనా.!

అహ్మదాబాద్, SVP అంతర్జాతీయ విమానాశ్రయం

అది గుజరాత్, అహ్మదాబాద్ లోని.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. జూన్ 12, మధ్యాహ్నం 1. 38 గంటలసమయం. బోయింగ్ 787- 8 మోడల్‌కి చెందిన ఎయిర్ ఇండియా – ఫ్లైట్ ఏ 1\ 171 గాల్లోకి ఎగిరిన ఐదు నిమిషాలకే అకస్మాత్తుగా కుప్ప కూలిపోయింది.


లండన్ గాట్విక్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లాల్సిన ఫ్లైట్

అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్‌లో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. సిబ్బందిలో ఇరువురు పైలెట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉండగా.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్‌గా క్లైవ్ కుందర్ ఉన్నారు. మృతుల్లో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీతో పాటు మొత్తం 169 భారతీయులుండగా.. 53 మంది బ్రిటన్, ఏడుగురు పోర్చు గీస్, ఒక కెనడియన్ ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ సహా.. ఇంగ్లండ్ ప్రధాని సైతం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ అధికారులతో లండన్ అధికారులు కలసి పని చేస్తున్నారు.

ఈ మోడల్ కి జరిగిన అతి పెద్ద ప్రమాదమిదే- ఎక్స్ పర్ట్స్

ఎక్కువ దూరం తక్కువ ఇంధన సామర్ధ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణీకులు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణానుభవంలో సుప్రసిద్ధమైనదిగా ఈ బోయింగ్ 787 గురించి చెబుతారు. ఇదే ఈ మోడల్ విమానానికి జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా అంచనా వేస్తున్నారు నిపుణులు.

కూలే ముందు.. విమానం నుంచి మేడే కాల్

కూలే ముందు.. విమానం నుంచి మేడే కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం ఎదురైనపుడు ఎమెర్జెన్సీని సూచించేందుకు.. రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఈ కాల్ చేస్తారు. దీన్నే మేడే కాల్ అంటారు. అయితే మేడే కాల్ కు ఏటీసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ చెబుతోంది.

సహాయక చర్యల్లో అగ్నిమాపక, NDRF, BSF

ప్రమాద స్థలానికి అగ్నిమాపక బృందాలు NDRF, BSF బృందాలు.. హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలిలో ఉధృతంగా ఎగసిన మంటలు, పొగలు తీవ్ర ఆందోళన కలిగించాని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. గాయపడ్డవారిని హుటాముటిన ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలా ఎయిర్ ఇండియా హాట్ లైన్ నెంబర్ 1800 5691444 ని ప్రారంభించింది. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టనున్నట్టు ప్రకటించిందీ విమానయాన సంస్థ.

1. 10 గం. కు బయలు దేరాల్సిన ఫ్లైట్

ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. ఈ విమానం మధ్యాహ్నం ఒంటిగంట 55నిమిషాలకు బయలుదేరగా.. దీని బయలు దేరాల్సిన సమయం ఒంటిగంటా పది నిమిషాలుగా తెలుస్తోంది. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ప్రమాద స్థలిలో పెద్ద శబ్ధంతో కూడిన పేలుడు సంభవించిందని.. నల్లటి పొగలు కమ్ముకున్నట్టు వివరించారు ప్రత్యక్ష సాక్షులు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లా చెదురుగా ఉన్న శిథిలాలు కనిపించాయి.

2020లో చివరిగా జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదం

భారత్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చివరగా 2020లో చోటుచేసుకుంది. 2020 ఆగస్టు 7వ తేదీన Air India ఎక్స్‌ప్రెస్ IX-1344 ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 190 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లోయలో పడి రెండుగా విడిపోయింది. కరోనా కారణంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అప్పుడు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం, లో- విజిబిలిటీ కారణంగా రన్‌వే దాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోయలో పడి రెండు ముక్కలవడంతో ఇద్దరు పైలట్లతో సహ 21 మంది చనిపోగా, 100 మంది గాయపడ్డారు.

అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

తాజాగా ఈ ప్రమాదం విషయానికి వస్తే.. ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది విమానయాన శాఖ. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతుండగా.. ప్రమాదానికి గల కారణాలను సైతం దర్యాప్తు చేస్తున్నారు.

టేకాఫ్ తర్వాత పక్షులు ఢీకొని ఉండొచ్చు-నిపుణులు

టేకాఫ్‌ అయిన తర్వాత పక్షులు విమానాన్ని ఢీకొని ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో నివాస గృహాలు, చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో.. పక్షులు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందన్నది విచారణలో బయటకు వస్తుందని అంటున్నారు.

డ్రీమ్ లైనర్‌గా పిలిచే ఈ మోడల్‌పై అంతటి కంప్లయింట్లు ఏంటి?

ఇప్పుడందరి దృష్టి బోయింగ్ 787 బోయింగ్ మీదే. డ్రీమ్ లైనర్‌గా పిలిచే ఈ మోడల్‌పై అంతటి కంప్లయింట్లు ఏంటి? కారణాలు ఏమై ఉంటాయి? మోస్ట్ మోడ్రన్ ఫ్లైట్ గా పేరుండి పదే పదే టెక్నికల్ సమస్యలేంటి? రీసెంట్ గా ఈ ఫ్లైట్ కి ఎదురైన సమస్యలేంటి? ఈ క్లాస్ విమానాలెందుకంత ప్రమాదకరం?

2011లో డ్రీమ్ లైనర్ ని ప్రవేశ పెట్టిన బోయింగ్

అయినా అనుమతులు లభించడంపై అనుమానాలుఅహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నిలువునా కూలిన 787-8 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలేంటని చూస్తే.. బోయింగ్ సంస్థ- డ్రీమ్ లైనర్ ని 2011లో ప్రవేశ పెట్టింది. బోయింగ్ 767-200ER, ఎయిర్‌బస్ A330-200 వంటి పాత విమానాల స్థానంలో.. బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్‌ని తీసుకువచ్చింది.

పెద్ద డిమ్మబుల్ విండోలు, రేక్డ్ వింగ్ టిప్స్ వంటి ఫీచర్లు

పెద్ద ఎలక్ట్రానిక్ డిమ్మబుల్ విండోలు, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం.. రేక్డ్ వింగ్‌ టిప్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది డ్రీమ్ లైనర్. విమానం ఫ్రేమ్‌లో సగం కార్బన్ ఫైబర్- రీన్ ఫోర్స్డ్ పాలిమర్ నిర్మాణాన్ని కలిగి ఉంది. దీంతో బరువు తక్కువగా ఉండటంతో పాటు, ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమాన యాన సంస్థల ప్రయారీటీగా డ్రీమ్ లైనర్ నిలుస్తోంది.

242 మంది ప్రయాణీకులు కూర్చునే సామర్ధ్యం

విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. 2-క్లాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 787-7 డ్రీమ్ లైనర్ ఒకేసారి 13,530 కి.మీ ప్రయాణించ గలదు. అందుకే దీన్ని సుదూర ప్రయాణాలకు ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన 787-8 డ్రీమ్ లైనర్ రెండు ఇంజన్లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా.. అమెరికన్ ఎయిర్‌లైన్స్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, జపాన్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్‌వేస్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్‌లు ఈ మోడల్ విమానాలను కలిగి ఉన్నాయి.

14 ఏళ్లలో వంద కోట్లకు పైగా ప్రయాణికులను..

14 సంవత్సరాలలో 787 డ్రీమ్‌లైనర్ ఒక బిలియన్ కంటే.. ఎక్కువ మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చిందంటే అర్ధం చేసుకోవచ్చు. విమానయాన చరిత్రలో ఏ ఇతర వైడ్ బాడీ జెట్ కూడా ఈ ఘనత సాధించలేదు. దీని డిజైన్, ఇంధన సామర్థ్యం విమానయాన సంస్థలకు ఎన్నో లాభాలు తీసుకొచ్చి పెట్టింది. తేలికైన దీని నిర్మాణం కారణంగా, ఇది పాత విమానాల కన్నా 25 శాతం తక్కువ ఇంధనాన్ని వాడుతుంది. డ్రీమ్ లైనర్ శ్రేణిలో 2000 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే, దీనిలో 26 శాతం 787-8 వేరియంట్‌ విమానాలే ఉన్నాయి. జనవరి 2023 నాటికి 386 యూనిట్లు డెలివరీ అయ్యాయి.

గత కొన్నేళ్లుగా ఎన్నో సాంకేతిక సమస్యలతో సతమతం

బిజినెస్‌ స్టాండర్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి. కార్బన్ ఫైబర్-రీన్‌ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. అందుకే దీనికి తక్కువ ఇంధనం సరిపోతుంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ విమానం ఎన్నో సాంకేతిక, భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది.

ఈ రెండూ జపాన్ విమానయాన సంస్థలకు చెందినవే

2013లో, లిథియం-అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన రెండు వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్‌లైనర్‌లను ప్రపంచవ్యాప్తంగా ఆపేశారు. అందులో ఒకటి బోస్టన్‌లో జపాన్ ఎయిర్‌లైన్స్ 787, మరొకటి జపాన్‌లోని ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్‌కు మిడ్-ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను తిరిగి రూపకల్పన చేసేవరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డ్రీమ్‌లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది.

2024 మార్చిలో LATAM ఎయిర్‌లైన్స్..

2024లో కంపెనీ విజిల్ బ్లోయర్- దీని నిర్మాణ సమస్యల గురించి యూఎస్ సెనెట్‌కి రిపోర్ట్ చేసింది. దీంతో FAA దర్యాప్తు ప్రారంభించింది. అదింకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. 2024 మార్చిలో LATAM ఎయిర్‌లైన్స్ బోయింగ్ 787-9 విమానంలో సమస్యలు రావడంతో పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్‌పిట్‌ లోని సీటు-స్విచ్ పనిచేయకపోవడం వల్లే.. ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. గత కొన్నాళ్లుగా డ్రీమ్ లైనర్లను నడుపుతోన్న పైలట్లు.. ఇంజిన్ ఐసింగ్, జనరేటర్ వైఫల్యాలు, ఇంధన లీకేజీల గురించి ఆయా విమాన యాన సంస్థలకు చెబుతూ వచ్చారు. అయితే ఇంత భారీ ప్రమాదమైతే డ్రీమ్ లైనర్ జర్నీలో ఇదే జరగడమని అంటారు.

అయినా అనుమతులు లభించడంపై అనుమానాలు

ఇదే విమానం.. ఆరు నెలల క్రితం తీవ్ర సాంకేతిక సమస్యలను ఎదుర్కున్నట్టు కొన్ని మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో లండన్ వెళ్తోన్న.. AI-171 ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. ఆ సమయంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్‌లో ఉన్నారు. డ్రీమ్ లైనర్ నిర్వహణా లోపాలు, భద్రతా విధానాలపై పలు సార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే డ్రీమ్ లైనర్ కార్యకలపాలకు అనుమతులు లభించడం గమనార్హంగా చెబుతారు.

-Story By adinarayana , Bigtv Live

 

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×