Flight Crash Video: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న సర్థార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఒక్కసారిగా ప్రమాదానికి గురైంది. ఏం జరిగిందో తెలిసే లోగా నగరంలోని మేఘానీ ఏరియాలోకి దూసుకెళ్లింది. దీంతో.. ఒక్కసారిగా విమానం నుంచి దట్టమైన పొగలు వెలువడ్డాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తోంది ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం. యథావిధిగా మధ్యాహ్నం తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే నేలను తాకింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిగో లైవ్ వీడియో..
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. విమానం జనావాసలపై పడిపనట్టు వీడియోలో కనిపిస్తోంది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. విమానం కూలిన ప్రదేశంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి.
LIVE VIDEO
Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today#Ahmedabadplanecrash #london #planecrash #Ahmedabad #AirIndia pic.twitter.com/OKnCHYOlIw
— Kanhiya (@skanhiya319) June 12, 2025
విమానం నేలను తాకడంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానంలో భారీగా ఇంధనం ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. లండన్ వరకు వెళ్తుండడంతో పెద్ద ఎత్తున ఫ్యూయల్‌ను విమానంలో నింపారు. దీంతో.. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రమాదం విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి సహాయక బృందాలు. పదుల సంఖ్యలో ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి. విమాన ప్రమాదం నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రమాదం ఎలా జరిగింది..? అందుకు దారి తీసిన కారణాలపై సీఎంను అడిగి వివరాలు తెలుసుకున్నారు అమిత్ షా.
ALSO READ: Minister Rammohan Naidu: విమానం ఘటన.. కేంద్రమంత్రి రామ్మోహన్ రియాక్షన్
ఈ సమాచారం తెలిసిన వెంటనే పౌరవిమానాయన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఘటనా స్థలికి బయల్దేరారు. విమానం జనావాసాలపై కూలిన నేపథ్యంలో క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటనపై కేంద్ర ఆయన స్పందించారు. ఈ ఘటన తనను షాక్‌కు గురి చేసిందన్నారు. వెంటనే సహాయ చర్యలు ప్రారంభమయ్యాయని.. పరిస్థితిని తానే స్వయంగా పర్యవేక్షిస్తున్నాని తెలిపారు.