India Vs Pakistan War : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. ఈ నానుడిని నిజం చేసింది మన ఆకాశ్ మిస్సైల్. ఇటు పాకిస్తాన్‌కు, అటు చైనాకు ఇండియా సత్తా ఏంటో చూపించింది. ఆపరేషన్ సిందూర్‌తో ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ గురువారం రాత్రి మరోసారి బరి తెగించింది. పంజాబ్‌లోని హోషియాపుర్‌పై మిస్సైల్ ఎటాక్ చేసింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ JF-17 ద్వారా, చైనాకు చెందిన PL-15 లాంగ్ రేంజ్ మిస్సైల్‌తో దాడికి దిగింది. అప్పటికే పాక్ బోర్డర్ చుట్టూ మోహరించిన ఆకాశ్ అలర్ట్‌గా ఉంది. చైనా మిస్సైల్‌ను గాల్లోనే పేల్చేసింది. చైనా మేడ్ గైడెడ్ మిస్సైల్‌ను నిర్వీర్యం చేయడం మామూలు విషయం కాదు. ఆకాశ్ మిస్సైల్‌ను ముద్దుగా ఓజీ అంటూ నామకరం చేశారు నెటిజన్లు.
మేడిన్ ఇండియా మిస్సైల్
ఆకాశ్ మిస్సైల్ పూర్తిగా మేడిన్ ఇండియా. స్వదేశీ పరిజ్ఞానంతో DRDO తయారు చేసింది. భూమి మీది నుంచి.. 45-70 కిలోమీటర్ల వరకు ఆకాశంలో దాడులు చేయగలదు. మల్టిపుల్ శత్రువులను ఒకేసారి ఎటాక్ చేయగల సామర్థ్యం ఉంది. 60 కిలోల పేలుడు ఉంటుంది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో వందశాతం అక్యురేట్‌గా టార్గెట్స్‌ను చేధించింది ఆకాశ్.
ఆకాశ్.. కిరాక్ షో
ఆకాశ్ మిస్సైల్‌ను ఎక్కడికైనా ఈజీగా తరలించొచ్చు. అత్యంత సున్నితమైన ప్రాంతాలకు తీసుకెళ్లొచ్చు. స్వార్మ్ థ్రెట్‌ను అంటే గ్రూప్ ఆఫ్ డ్రోన్స్‌ను కూడా ఈజీగా ధ్వంసం చేయగలదు. స్వార్మ్ డ్రోన్స్‌ను ఛేదించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అందులోని డ్రోన్స్ ఒకదాన్ని ఒకటి కో ఆర్డినేట్ చేసుకుంటూ.. డిఫరెంట్ మార్గాల్లో ఒకే టార్గెట్‌పై విరుచుకుపడతాయి. అలాంటి వాటిని సైతం నిర్వీర్యం చేస్తుంది ఆకాశ్ మిస్సైల్.
ఆకాశంలో ఆకాశ్ రక్షణ
ఆకాశ్ మిస్సైళ్లను మరింత అడ్వాన్స్‌గా తయారు చేసింది భారత్. ఇజ్రాయిల్‌తో కలిసి అప్‌గ్రేడ్ చేసింది. ఇవి 70 నుంచి 100 కిలో మీటర్ల వరకు.. ఆకాశం నుంచి దూసుకొచ్చే హై స్పీడ్ శత్రుమూకల దాడులను అడ్డుకుంటుంది. ఇందులోని ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్.. క్రూజ్ మిస్సైళ్లను, ట్రాక్ చేస్తుంది.. అడ్డుకుంటుంది. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఆకాశ్.. ఆపరేషన్ సిందూర్‌లో కీలక ఆయుధంగా మారింది. పాక్ దాడుల నుంచి భారత్‌ను సురక్షితంగా కాపాడుతోంది.
Also Read : ఇంకా కశ్మీర్ కోసమే కక్కుర్తా? పాక్ బుద్ది మారదా?
పంజాబ్‌లో పాక్ ఫసక్
పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. పంజాబ్ ప్రావిన్స్‌లో పాక్‌కు ధీటైన జవాబు చెప్పింది. పాకిస్తాన్ కి చెందిన యుద్ధ విమానాలు నేలమట్టం చేసింది. పాక్ కి చెందిన AWAC ను భారత బలగాలు కూల్చివేశాయి. అవాక్ తో పాటు F 16 ఫైటర్ జెట్స్, రెండు JF 17 ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసింది. డ్రోన్లు, మిసైళ్లతో పాటు అవాక్ నేలమట్టం కావడంతో పాకిస్తాన్ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దూర ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఉపయోగించే AWAC నేలమట్టం కావడంతో పాక్ మరింత డిఫెన్స్ లో పడింది. మన డిఫెన్స్ సిస్టమ్‌ది అప్పర్ హ్యాండ్ అయింది.