BigTV English

Pawan Sai : నేనేం పారిపోలేదు… కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటో చెప్పిన సీరియల్ నటుడు

Pawan Sai : నేనేం పారిపోలేదు… కనిపించకుండా పోవడానికి రీజన్ ఏంటో చెప్పిన సీరియల్ నటుడు

serial actor Pawon: బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్స్ లో మొగలిరేకులు ఒకటి. ఈ సీరియల్ ఎంతోమంది నటులకు గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సీరియల్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టి వారు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు అని చెప్పొచ్చు. అలాంటి వారిలో ఒకరు పవన్ సాయి. మొగలిరేకులు సీరియల్ లోఈశ్వర్ పాత్ర లో కనిపించి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించాడు ఆయనకి అంతలా గుర్తింపు తెచ్చిన మరో సీరియల్ ముద్దమందారం. జీ తెలుగులో ప్రసారమైన ఈ సీరియల్ దాదాపు 1000 ఎపిసోడ్స్ పైగానే రన్ చేశారు. ఈ ఈ సీరియల్ లో పవన్ సాయి దేవ పాత్రలో ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుంటాడు. తాజాగా పవన్ సాయి మరో కొత్త సీరియల్ ఘరానా మొగుడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో భాగంగా పవన్ సాయి సీరియల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ ముచ్చట్ల గురించి చూద్దాం..


ఘరానా మొగుడుతో..రీ ఎంట్రీ ..

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ మూవీ చిరంజీవి సినిమాల్లోనే హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా దాదాపు పది కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది ఘరానా మొగుడు. ఆ సినిమా పేరుతో తెలుగులో జీ తెలుగులో సీరియల్ రాబోతుంది. సరికొత్త కథ కథనాలతో ఘరానా మొగుడు సీరియల్ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ సాయి ఈ సీరియల్ లో ఘరానా మొగుడుగా కనిపించనున్నారు. తాజాగా పవన్ సాయి సీరియల్ ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలుగా వీడియోను రిలీజ్ చేశారు. పవన్ సాయి మాట్లాడుతూ..నేను ఉండేది హైదరాబాదులోనే, నేను హీరోగా చేస్తే నాకు మేజర్, సోల్జర్ రోల్స్ చేయాలని ఉంది. నా బెస్ట్ హీరోయిన్ శ్రియ. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. నాతోపాటు నటించిన చేసిన నటీనటులలో,నాకు తనుజ యాక్టింగ్ నచ్చుతుంది. ఆమెతో కలిసి ముద్దమందారం ఎన్నో ఏళ్ళు నటించాను. సోషల్ మీడియా వాడడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఒకప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీ కోసం వస్తే నా ఫోన్లో ఫోటో దిగి వాళ్ళకి పంపిన రోజులు ఉన్నాయి. వాళ్ళు నా దగ్గరికి వచ్చే హడావిడిలో ఫోన్ మర్చిపోయి వచ్చేవారు. నా ఫోన్లో వారికి తో ఫోటో దిగి వారికి పంపించాను. ఇక ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిపోయాను అని అడిగే వాళ్ళకి ఇదే నా సమాధానం. నేను ఎక్కడికి వెళ్లిపోలేదు మంచి క్యారెక్టర్ కోసం మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. అలాంటి కథ ఇప్పుడు నా ముందుకు వచ్చింది. ఇంకా నేను ఎన్నో కొత్త క్యారెక్టర్స్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఘరానా మొగుడు సీరియల్ పవర్ఫుల్ క్యారెక్టర్ లో మీ ముందుకు వస్తున్నాను. ఈ సీరియల్ మీ అందరికీ నచ్చుతుంది. జీతెలుగుతో మరోసారి సీరియల్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నా ఫ్యామిలీలోకి నేను తిరిగి వచ్చాను అనిపిస్తుంది మీ అందరి ముందుకు కం బ్యాక్ ఇవ్వనున్నాను. ఘరానా మొగుడు సీరియల్ మే 12 వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతుంది. అందరూ చూసి ఆదరించండి అని పవన్ సాయి తెలిపారు.


మరో సరికొత్త సీరియల్ తో ..

ఇక పవన్ సాయి గత సీరియల్స్ లో మొగలిరేకులు ముద్దమందారం శ్రావణ సమీరాలు, ముద్దుబిడ్డ, వంటి సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఘరానా మొగుడు గా మాస్ అవతారంలో, ఫ్యాన్స్ ని అలరించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన సీరియల్ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో పవన్ సాయి ఒక లాంతరు పట్టుకొని, తన అత్తింటిని తగలబెట్టడం ప్రోమోలో చూపిస్తారు. ఇందులో అత్త క్యారెక్టర్ లో, భావన నటిస్తున్నారు. ఈ సీరియల్ మే 12న జీ తెలుగులో ప్రసారం కానుంది. పవన్ సాయి గత సీరియస్ లాగా ఈ సీరియల్ కూడా సక్సెస్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

?igsh=ZjFkYzMzMDQzZg==

Tags

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×