Akhilesh Yadav latest news(Telugu breaking news today): బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి పరోక్షంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఉద్దేశాలను నెరవేర్చుకునేందుకు పొరుగు దేశంలోని పరిస్థితులను ఉపయోగించుకుంటే చివరికి ఆ దేశమే బలహీనపడుతుందని అన్నారు. ఆయన ఏ దేశం పేరునూ ప్రస్తావించలేదు. అయితే బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఒక దేశంలోని పరిస్థితులను మరో దేశం ఆసరాగా చేసుకుని తమకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని అనుకుంటే అది వారిని అంతర్గతంగా, బాహ్యంగా బలహీనపరుస్తుంది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడం సరైన చర్య కాదు. అక్కడ ప్రదర్శలు హింసాత్మకంగా మారితే.. మౌనంగా ఉండటం సరికాదు. అది విదేశాంగ విధాన వైఫల్యమే అవుతుందని ఎక్స్ వేదికగా అఖిలేశ్ పేర్కొన్నారు.
Also Read: కలకత్తా ట్రైనీ వైద్యురాలి ఘటనపై దర్యాప్తునకు దీదీ డెడ్‌లైన్
అంతకు ముందు చేసిన మరో పోస్టులో కూడా ఆయన బంగ్లాదేశ్ పేరును ప్రస్తావించారు. సరైందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే పలు సందర్భంల్లో వివిధ కారణాలతో అనేక దేశాల్లో హింసాత్మక విప్లవాలు, తిరుగుబాట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ఆ దేశం మాత్రమే తిరిగి పుంజుకుంది. బంగ్లాదేశ్‌లో శాంతి స్ధాపనకు కేంద్రం కృషి చేయాలి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ఈ అంశాన్ని భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తాలని అన్నారు. బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
कोई भी समुदाय चाहे वह बांग्लादेश का अलग नज़रियेवाला बहुसंख्यक हो या हिंदू, सिख, बौद्ध या कोई अन्य धर्म-पंथ-मान्यता माननेवाला अल्पसंख्यक, कोई भी हिंसा का शिकार नहीं होना चाहिए।
भारत सरकार द्वारा इस मामले को अंतरराष्ट्रीय स्तर पर मानवाधिकार की रक्षा के रूप में सख़्ती से उठाया…
— Akhilesh Yadav (@yadavakhilesh) August 12, 2024