BigTV English

BJP First List: బీజేపీ తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

BJP First List: బీజేపీ తొలి జాబితాలో.. కంగనా రనౌత్, అక్షయ్‌ కుమార్‌..?

BJP First List


Akshay Kumar-Kangana Ranaut: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికకు బీజేపీ ముమ్మర కసరత్తులు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కు ముందే తొలి జాబితాను ప్రకటించనుంది బీజేపీ. అయితే ఈ జాబితాలో కొత్త వ్యక్తులు, యువ నేతలకు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటుడు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ ను బరిలో దించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

తొలి జాబితాలోనే వీరిద్దరుపేర్లు ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి అక్షయ్ కుమార్, హిమాచల్ ప్రదేశ్ మండి స్థానం నుంచి కంగనా రనౌత్ ను నిలబెట్టే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే సరైన సమయం అంటూ ఇటీవల కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.


కంగనా రనౌత్ బీజేపీలో చేరితే స్వాగతిస్తామని బీజేపీ పార్టీ అద్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. అటు అక్షయ్ కుమార్ కూడా వివిధ సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. లోక్ సభ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారుకు ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇటీవల కీలక సమావేశం నిర్వహించింది.

Read More: ఇంకో తొమ్మది మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు..

అభ్యర్థుల తొలి జాబితాను సత్వరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా 110కి పైగా పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం. చాలా చోట్ల సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ టికెట్లు దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా.. కొత్త ముఖాలకు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది.

 

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×