BigTV English

Allahabad High court: శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Allahabad High court:  శ్రీకృష్ణ జన్మభూమి వివాదం.. షాహీ ఈద్గా సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

Allahabad High court: ఉత్తర్‌ప్రదేశ్‌ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి భూవివాదానికి సంబంధించి అలహాబాద్‌ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్‌ని నియమించేందుకు కోర్టు అంగీకరించింది. అయితే అలహాబాద్‌ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈద్గా తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవ‌కాశాలు ఉన్నాయి.


షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చిందని, ఈ నెల 18న విధివిధానాలు నిర్ణయిస్తారని అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు తోసిపుచ్చింది.

షాహి ఈద్గా మ‌సీదును 17వ శ‌తాబ్ధంలో నిర్మించారు. కోర్టు నియ‌మించే కమిష‌న‌ర్ ఆధ్వర్యంలో స‌ర్వే చేప‌ట్టనున్నారు. శ్రీ కృష్ణుడు జ‌న్మించిన స్థలంలో ముస్లింలు మ‌సీదు నిర్మించిన‌ట్లు హిందూవాదులు ఆరోపిస్తున్నారు. హిందూ సేన‌కు చెందిన విష్ణు గుప్త స‌ర్వే కోసం డిమాండ్‌ చేశారు. విష్ణు గుప్త దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను స్థానిక కోర్టు గ‌త డిసెంబ‌ర్‌లో స్వీక‌రించింది. అయితే ఈద్గా తరపు న్యాయవాదులు అభ్యంత‌రం వ్యక్తం చేస్తూ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.


శ్రీకృష్ణ జ‌న్మస్థానంలో ఉన్న మొత్తం 13.37 ఎక‌రాల భూమిపై హిందువుల‌కే హ‌క్కును క‌ల్పించాల‌ని హిందూసేన డిమాండ్ చేస్తోంది. ఇక్కడ ఉన్న కాట్ర కేశ‌వ దేవ్ ఆల‌యాన్ని కూల్చి.. దాని స్థానంలో మ‌సీదును నిర్మించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొఘ‌ల్ చ‌క్రవ‌ర్తి ఔరంగ‌జేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జ‌రిగినట్టు ఆరోపణలు ఉన్నాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×