BigTV English

History Record: అద్భుతం, వైద్య చరిత్రలో మరో రికార్డు చేతులు అమర్చి..

History Record: అద్భుతం, వైద్య చరిత్రలో మరో రికార్డు చేతులు అమర్చి..

Amazing, another record in medical history


Amazing, another record in medical history: కొంతమంది పుట్టుకతోనే అంధులుగా పుడుతుంటారు. అందులో కొందరు కాళ్లు లేకుండా పుడితే.. మరికొందరు చేతులు లేకుండా పుడుతుంటారు. కానీ వారి పాలిట అదే శాపంగా మారుతుంది. వారు ఏ పని చేయలేక వారిలో వారే మదనపడుతూ ఉంటారు. అందుకే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో చాలామందికి కృత్రిమ కాళ్లు, చేతులు అమరుస్తుంటారు. కానీ.. ఇక్కడ ఓ చేతులు లేని వ్యక్తికి ఏకంగా కృత్రిమ చేతులు కాకుండా కొలతలు తీసుకొని నిజమైన చేతులను అమర్చి సరికొత్త అధ్యాయనానికి నాంది పలికారు. ఇది నిజంగా వైద్య చరిత్రలో ఓ అద్భుతం అనే చెప్పుకోవాలి.

ఇప్పటివ‌ర‌కు మనుషులకు చేసిన హార్ట్, లివర్‌ వంటి అవ‌య‌వ మార్పిడిల‌ను మాత్రమే మనం చూశాం. ఆ ట్రీట్‌మెంట్‌ సైతం ఎంతోమందికి విజ‌య‌వంతం కూడా అయ్యాయి. కానీ.. ఇక్కడ కనిపిస్తున్న ఓ పెయింటర్‌కి మాత్రం రెండు చేతులను అమర్చి అందరిని షాక్‌కి గురిచేశారు దిల్లీ వైద్యులు. ఈ వైద్యం విజయవంతం కావడంతో ఆ రోగి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రోగి కూడా త్వరలోనే కోలుకుంటాడని వైద్యం చేసిన డాక్టర్లు చెబుతున్నారు.


Read More: చిరుతపులిని బంధించిన బుడ్డోడు, తెలివికి నెటిజన్లు ఫిదా..

ఢిల్లీ పట్టణానికి చెందిన ఓ 45 ఏండ్ల వ్యక్తి పెయింటర్‌గా వర్క్ చేస్తున్నాడు. 2020లో జరిగిన ఓ విద్యుత్‌ ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. అతను వృత్తి రీత్యా పెయింటర్‌. తన చేతులను కోల్పోవడంతో తనకు అన్నం పెట్టే ఉపాధిని పూర్తిగా కోల్పోయాడు. నిరుపేద కుటుంబానికి చెందిన అతను దిక్కుతోచని స్థితిలో చనిపోవాలనుకున్నాడు. కానీ… అతడికి అదృష్టం ఢిల్లీలోని సరాగంగా రామ్ హాస్పిటల్ వైద్యుల ద్వారా దొరికింది. సరాగంగా రామ్ హాస్పిటల్ వైద్యులు అతనికి రెండు చేతులను అమర్చి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

అయితే ఇక్కడే ఓ అద్భుతం జరిగింది.ఢిల్లీ పట్టణంలోని ద‌క్షిణ ఢిల్లీ స్కూల్‌లో ప‌నిచేస్తున్న మీనా మెహ‌తా అనే ఆవిడా..బ్రెయిన్ డెడ్‌కు గుర‌య్యారు. అయితే తాను చ‌నిపోతే త‌న అవ‌య‌వాల‌ను దానం చేయాల‌ని తన కుటుంబస‌భ్యుల‌కు వైద్యులు సూచించారు. దీంతో బ్రెయిన్ డెడ్‌కు గురైన మీనా అవ‌య‌వాలు కిడ్నీ, లివ‌ర్, కార్నియాతో పాటు రెండు చేతుల‌ను దానం చేయాల‌ని కుటుంబస‌భ్యులు నిర్ణయించుకున్నారు. కిడ్నీ, లివ‌ర్, కార్నియాను ముగ్గురికి అందించారు. రెండు చేతుల‌ను పెయింట‌ర్‌కు అంద‌జేశారు.

Read More: అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. యూపీ కాంగ్రెస్ నేత క్లారిటీ..

మీనా రెండు చేతులను సర్‌గంగారామ్‌ ఆస్పత్రి వైద్యులు.. చేతులు కోల్పోయిన పెయింటర్‌కి అమర్చారు. ఈ సర్జరీ కోసం సుమారు 12 గంటలు శ్రమించారు వైద్యులు. బాధితుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. గురువారం నాడు డిశ్చార్జి చేస్తామని వైద్యులు ప్రకటించారు. అనంతరం వైద్యులతో ఫోటో దిగిన టైంలో ఆ పెయింటర్‌ తన చేతులతో థమ్స్‌ అప్ సింబల్ ఇచ్చి.. నాకు చాలా హ్యాపీగా ఉందని ఎమోషనల్ అయ్యాడు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×