BigTV English

Lok Sabha new bills: IPC, CRPCలకు రాం రాం.. సరికొత్త ‘భారతీయ’ చట్టాలకు శ్రీకారం..

Lok Sabha new bills: IPC, CRPCలకు రాం రాం.. సరికొత్త ‘భారతీయ’ చట్టాలకు శ్రీకారం..
New bills passed in parliament

New bills passed in parliament(Latest political news in India):

IPC, CRPC, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను సవరిస్తూ 3 బిల్లులు తెచ్చింది కేంద్రం. లోక్ సభలో బిల్లులను అమిత్ షా ప్రవేశపెట్టారు. క్రిమినల్‌ చట్టాల్లో భారీ మార్పులు చేశారు. సీఆర్పీసీ బదులుగా ‘భారతీయ న్యాయ సంహిత’ అనే చట్టాన్ని తెచ్చారు. ఐపీసీ బదులుగా ‘భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత’.. ఎవిడెన్స్‌ యాక్ట్‌ బదులుగా ‘భారతీయ సాక్ష్య బిల్’లును తీసుకొచ్చింది కేంద్రం. అయితే ఈ మూడు బిల్లులలోనూ ఇండియా అనే పదం లేకుండా భారతీయతను చొప్పించడం రాజకీయంగా ఆసక్తికరం.


కొత్త చట్టాల ప్రకారం.. మూక దాడులకు ఏడేళ్లు, గ్యాంగ్‌ రేప్ కు 20 ఏళ్లు, మైనర్‌పై రేప్ కేసులలో మరణ శిక్ష పడుతుంది. బిల్లుపై మరింత చర్చించేందుకు స్టాండింగ్‌ కమిటీకి సిఫారసు చేశారు.

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌లు బ్రిటిష్‌ కాలంనాటి చట్టాలని.. ఆంగ్లేయుల పాలనను బలోపేతం చేసేలా.. ఎదురుతిరిగిన వారిని శిక్షించేలా ఆ చట్టాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదని.. ఇప్పటికీ ఆవే పాత చట్టాలను పాటిస్తుండటం కరెక్ట్ కాదనే అభిప్రాయంతో.. సరికొత్త భారతీయ చట్టాలను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది ప్రభుత్వం. రాజద్రోహం వంటి చట్టాలను తొలగిస్తోంది.


ఈ కొత్త చట్టాలు భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని.. శిక్ష వేయడమే కాకుండా.. న్యాయం జరిగేలా చేయడం వీటి లక్ష్యమని.. బిల్లులను ప్రవేశపెట్టే సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయమన్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×