Torso In Suitcase: చెన్నై-ఢిల్లీ రైలులో దారుణమైన ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ సూట్‌కేస్‌లో మనిషిని చంపిన శరీర భాగాలు కనిపించాయి. అంతేకాదు మహిళ శరీర భాగాలతో బిర్యానీ వండినట్టు తేలింది. ఈ కేసు మిస్టరీని చెన్నై పోలీసులు ఛేదించారు. అసలు ఏం జరిగింది? ఇంతకీ మృతురాలు ఎవరు? ఇలా తీగలాగితే డొంక అంతా కదిలింది.
ఆగష్టు 5న చెన్నై నుంచి ఢిల్లీకి తమిళనాడు నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్లింది. యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. జనరల్ కంపార్ట్‌మెంట్‌లో దుర్వాసన రావడంతో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. రంగంలోకి దిగిన పోలీసులు, బోగీని తనిఖీ చేశారు. ఎరుపు రంగు సూట్‌కేస్ లభించడంతో ఓపెన్ చేశారు. అందులో మహిళ శరీర భాగాలు కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. సూట్‌కేసులో కుక్కిన మనిషి మొండెం కనిపించింది. రెండువారాల తర్వాత మృతురాలిని నిషాగా గుర్తించారు. తమిళనాడులోని పరమకుడి ప్రాంతానికి చెందినది గుర్తించారు.
దర్యాప్తులో సూట్‌కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు తేలడంతో అక్కడి పోలీసులు.. తమిళనాడు రైల్వే పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి దాదాపు 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. రెడ్ కలర్ సూట్‌కేస్‌తో వచ్చిన ఓ వ్యక్తితోపాటు మహిళ తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైల్లో సూట్‌కేస్‌ను పెట్టి అక్కడి నుంచి సైలెంట్‌గా రైలు దిగేశారు. ఆ తర్వాత వారిద్దరు సబర్బన్ రైలెక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఒడిశాకు చెందిన మాణిక్- భార్య భాగమతి ఉంటున్నారు. వీరితోపాటు హయాత్ నిషా అనే మహిళ ఉంటున్నట్లు తేలింది. హత్యకు గురైంది నిషాయేనని అంచనాకు వచ్చారు.
హయత్ నిషా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. నిషా భర్తతో విడిపోయిందని తేలింది. ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతడు మెకానిక్‌గా చెన్నై తాంబరంలో పని చేస్తున్నట్లు తేలింది. నిషా ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ గూడువాంజేరిలో నివాసం ఉంటుంది. పోలీసు వర్గాల సమాచారం మేరకు.. నిషా-మాణిక్య మధ్య అక్రమ సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి నిషాను ఆమె కుమారుడు వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. చివరకు తల్లితో గొడవపడి విడిగా ఉన్నట్లు తెలిసింది. నిషా కనిపించకుండా పోయిన తర్వాత ఆమె కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. గుడువంచేరి పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేశారు.
హయాత్ నిషా.. మాణిక్ దంపతులతో ఉంటోందని సమాచారం వచ్చింది. ఆమెని హత్య చేసి ముక్కలు చేసి సూట్‌కేస్‌లో పెట్టినట్టు తేలింది. స్థానిక పోలీసుల సాయంతో మాణిక్ ఉన్న ఇంటి తలుపులు పగుల గొట్టారు. లోపల ఓ బిర్యానీ పాత్ర, దానిపై మూతపెట్టి అతికించి ఉంది. మూత ఓపెన్ చేయగా మనిషి శరీర భాగాలు కనిపించడంతో షాకయ్యారు. ఇల్లంతా అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. హత్యకు గురైన మహిళ తల కోసం గాలిస్తున్నారు. మాణిక్ దంపతులు తనకు తమ్ముడు-మరదలు అవుతారని హయాత్ చెప్పినట్లు ఇరుగుపొరుగువాళ్ల నుంచి సమాచారం సేకరించారు.
ALSO READ: రాహుల్ కీలక వ్యాఖ్యలు.. మనుస్మృతి నియమం సిగ్గుచేటు, పంజరం నుంచి బయటకు రావాలంటూ
ఒడిశాకు చెందిన దంపతులను గుర్తించినప్పటికీ హత్యకు గల కారణాలు తెలియరాలేదు. అనుమానితులు మాణిక్-భాగమతిల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు చేశారు. ఈ దంపతులు గుడువంచేరిలోని మసీదు వీధిలో అద్దెకు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇరుగుపొరుగు వారిని విచారించారు. ఒడిశాకు చెందిన ఇద్దరు మహిళలు-ఓ వ్యక్తి ఉంటున్నారని తెలిపారు. మాణిక్యం అస్సాకు చెందినవాడిగా అనుమానిస్తున్నారు.