BigTV English

Karthika Deepam 2 Serial: కార్తీకదీపం.. ఐపీఎల్ ను తట్టుకుని వెలుగుతుందా..?

Karthika Deepam 2 Serial: కార్తీకదీపం.. ఐపీఎల్ ను తట్టుకుని వెలుగుతుందా..?


Karthika Deepam New Season: కార్తీక దీపం.. 2017 అక్టోబర్ 16 నుంచి 2023 జనవరి 23 వరకు 1569 ఎపిసోడ్స్ స్టార్ మా ఛానెల్ లో ఈ సీరియల్ ప్రసారం జరిగింది. నాలుగేళ్లకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరించింది ఈ సీరియల్. ఈ ధారావాహికలో నటించిన నిరూపమ్, ప్రేమి విశ్వనాథ్ లు డాక్టర్ బాబు, వంటలక్కగా ప్రాచుర్యం పొందారు. వాళ్ల అసలు పేర్లకంటే.. ఈ పేర్లు చెబితేనే తొందరగా గుర్తుపడతారు. రాత్రి 7.30 గంటలైతే చాలు.. ఇంట్లో ఆడాళ్లే కాదు.. మగాళ్లు కూడా ఈ సీరియల్ కోసం టీవీలకు అతుక్కుపోయేవారు. ఐపీఎల్ సీజన్ వచ్చినపుడు మాత్రం.. సీరియల్ చూడాలా ?మ్యాచ్ చూడాలా ? అనే సంశయం వచ్చేది. అలాంటి సమయంలో కొందరు ఇళ్లల్లో రెండు టీవీలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో అయితే.. ఈ సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథే ఓ మహిళకు సీరియల్ చూసేందుకు స్వయంగా టీవీని కొనిచ్చింది.

అయితే.. ఇప్పుడు మళ్లీ కార్తీకదీపం 2 వస్తోంది. ఈ సీజన్.. మొదటి స్టోరీకి ఏమాత్రం సంబంధం లేకుండా తీస్తున్నారు. మార్చి 21న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సీరియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సాధారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాలకు నిర్వహిస్తారు. కానీ.. సీరియల్ కు కూడా ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించడం కాస్త స్పెషల్ గా ఉంది. ఇక సీరియల్ ప్రసారం విషయానికొస్తే.. మార్చి 25వ తేదీ నుంచి ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు సీరియల్ ను స్టార్ మా ఛానల్ లోనే టెలీకాస్ట్ చేయనున్నారు. అంతా ఓకే.. కానీ.. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవుతోంది. ఈ సమయంలోనే కార్తీకదీపం 2 రావడం ఆ సీరియల్ కు ఎఫెక్ట్ అవ్వదా ? పైగా మొదటి పార్ట్ కి కంటిన్యూషన్ కూడా కాదు. మొదట్లో ఎపిసోడ్స్ ఆసక్తిగా ఉంటేనే కదా.. సీరియల్ హిట్ అయ్యేది.


Also Read : బ్యాంగ్ బ్రదర్స్ ‘ఓం భీమ్ బుష్’ మూవీ ఫుల్ రివ్యూ.. శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్టు పడ్డట్టేనా?

మొదటి సీజన్లో డైరెక్టర్ ఎండింగ్ సరిగ్గా ఇవ్వకపోవడంతో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. లాక్ డౌన్ సీరియల్ పై ప్రభావం చూపించింది. కార్తీక్, దీప చనిపోయినట్లు చూపించడం పెద్ద మైనస్ అయింది. మరిప్పుడు సీజన్ 2 ను ఎలా రక్తికట్టిస్తారు. ఐపీఎల్ సీజన్ ఎండయ్యే వరకూ టీఆర్పీ రేటింగ్స్ ను ఎలా కాపాడుకుంటారన్నది వీక్షకుల ప్రశ్న. సీరియల్ హీరో నిరూపమ్.. అదేనండి మన డాక్టర్ బాబు మాత్రం.. ఐపీఎల్ సీజన్ సీరియల్ పై ఏమాత్రం ప్రభావం చూపించదని అంటున్నారు. కానీ.. ఇళ్లలో మాత్రం ఒక పక్క సీరియల్ – మరో పక్క ఐపీఎల్ మ్యాచ్ అంటే.. యుద్ధాలే జరుగుతాయి. మరి ఐపీఎల్ ను తట్టుకుని కార్తీకదీపం ఎలా వెలుగుతుందో చూడాలి.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×