NationalLatest Updates

Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్..

Another train accident in Odisha

Odisha : ఒడిశాలోని బాలేశ్వర్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోర ప్రమాదానికి గురైన ఘటన మరువక ముందే మరో ఘటన కలవరం రేపింది. తాజాగా బర్గఢ్‌ జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతుండగా సంబర్‌ధార వద్ద ట్రైన్ ప్రమాదానికి గురైంది.

ఆ సమయంలో ఈ రైలు బర్గఢ్‌ నుంచి దుంగ్రీ ప్రాంతానికి వెళుతోంది. ఏసీసీ సిమెంట్‌ కర్మాగారంలో సున్నపురాయి గనుల నుంచి ప్లాంట్‌కు లోడు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

శుక్రవారం బాలేశ్వర్‌ వద్ద యశ్వంత్‌పూర్‌, కోరమాండల్‌ సూపర్‌ఫాస్ట్‌, గూడ్స్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో 275 మందికిపైగా మృతి చెందారు. ఈ ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలోనే ఒడిశాలో మరోచోట రైలు బోగీలు తప్పడం ఆందోళన కలిగిస్తోంది.

Related posts

Jr Ntr : NTR 30 ప్రీ ప్రొడక్షన్ వర్క్.. టీమ్‌తో కొరటాల డిస్కషన్స్.. పొటోలు వైరల్

BigTv Desk

Padmanabha:-తిరుపతి శ్రీవారిని మించిన పద్మనాభుడు

Bigtv Digital

Parasuramudu : పరశురామునికి గండ్ర గొడ్డలి ఇచ్చిన మహాశివుడు

BigTv Desk

Leave a Comment