TSPin

KCR : కోకాపేటలో భారత్ భవన్ నిర్మాణం.. కేసీఆర్ భూమిపూజ..

KCR Bhumi Pooja for the construction of Bharat Bhavan in Kokapet

CM KCR News Today(Telangana news updates): హైదరాబాద్‌లో భారీ భవన నిర్మాణానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. భారత్‌ భవన్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ కేంద్ర నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్యనేతలు, కొందరు మంత్రులు, హైదరాబాద్‌ నగర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

హైదరాబాద్‌ నగర శివారులోని కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తారు. ఈ భవనంలో పరిశోధన, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. నాయకులకు అవసరమైన సమగ్రమైన సమాచారం లభించే ఏర్పాట్లు చేస్తారు.

భారత్ భవన్ లో సమావేశ మందిరాలు, అత్యాధునిక డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన తరగతి గదులు, సమావేశ మందిరాలను ఏర్పాటు చేస్తారు.శిక్షణకు వచ్చేవారు బస చేసేందుకు వసతి ఏర్పాట్లు చేస్తారు. దేశంలోని ప్రముఖ సంస్థల్లో పనిచేసిన కొందరు సీనియర్లను శిక్షణ, పరిశోధన కార్యక్రమాల కోసం నియమిస్తారు. రిటైర్డ్‌ అధికారులు, న్యాయనిపుణులు, రాజకీయ రంగంపై అవగాహన ఉన్నవారిని సమన్వయకర్తలు, శిక్షకులు, సబ్జెక్ట్‌ నిపుణులుగా నియమిస్తారు.

Related posts

AP : స్టిక్కర్ల రాజకీయం.. 3 పార్టీలు పోటా పోటీగా కార్యక్రమాలు..

Bigtv Digital

Viveka Murder Case: అవినాష్ నిందితుడే.. జగన్‌కు ముందే తెలుసు.. సీబీఐ కౌంటర్..

Bigtv Digital

Amit Sha : చేవెళ్ల శంఖారావం.. టార్గెట్ బీఆర్ఎస్, ఎంఐఎం ..

Bigtv Digital

Leave a Comment